»   » అతనే నా కాబోయే భర్త.. గుట్టు విప్పిన నయనతార.. పెళ్లి డేట్‌ ఫిక్స్!

అతనే నా కాబోయే భర్త.. గుట్టు విప్పిన నయనతార.. పెళ్లి డేట్‌ ఫిక్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

దక్షిణాదిలో ప్రస్తుతం లేడి సూపర్‌స్టార్ ఎవరంటే ఠక్కున నయనతార అనే ఒకే ఒక పేరు గుర్తోస్తుంది. ఇటీవల ఆమె నటించిన కర్తవ్యం, ఇతర చిత్రాలు లేడీ సూపర్‌స్టార్ హీరోయిన్‌ ట్యాగ్ తెచ్చిపెట్టాయి. కెరీర్ విషయంలో రాకెట్‌లా దూసుకెళ్తున్న నయనతార వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులు ఆరంభం నుంచి మీడియాను ఆకర్షిస్తునే ఉన్నాయి. గతంలో శింబు, ప్రభుదేవా, ఆర్య లాంటి హీరోలతో అఫైర్లు పెళ్లి దాకా వచ్చి ఆగిపోయాయి. ప్రస్తుతం దర్శకుడు విగ్నేష్ శివన్‌తో అఫైర్, డేటింగ్ వార్తలు మీడియాలోనే కాదు సోషల్ మీడియాలో హల్‌చల్ రేపుతున్నాయి. ఇప్పటి వరకు విగ్నేష్‌తో రిలేషన్‌పై పెదవి విప్పని నయన్ తాజాగా ఆయన గురించి ఓపెన్ అయ్యారు.

 సహకారం మరువలేనిది

సహకారం మరువలేనిది

చెన్నైలో ఇటీవల మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా నయనతార సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎక్సెలెన్స్ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డు అందుకొన్న ఆమె మాట్లాడుతూ.. నా కెరీర్‌లో ఒడిదుడుకులకు లోనప్పుడు నాకు సపోర్ట్‌గా నిలిచిన అమ్మ, నాన్న, అన్నయ్య, నా కాబోయే భర్త అందించిన సహాకారం మరువలేనిది అని నయనతార అన్నారు.

అద్భుతమైన స్ఫూర్తి

అద్భుతమైన స్ఫూర్తి

ఇప్పటి వరకు నేను హాజరైన అన్ని అవార్డుల ఫంక్షన్ అన్నింటిలోకి ఇదే గొప్ప ఫీలింగ్ కలిగించిన కార్యక్రమిది. ఇక్కడ పలు రంగాల్లో ఎంతో సాధించిన ఎందరో మహిళ మధ్య ఈ అవార్డు అందుకోవడం అద్భుతమైన స్ఫూర్తి కలిగించింది. ఆ గొప్ప భావనతో ముందుకెళ్లడం మంచి సంతృప్తిని కలిగిస్తున్నది అని నయనతార అన్నారు.

విఘ్నేష్ నాకు కాబోయే భర్త

విఘ్నేష్ నాకు కాబోయే భర్త

ఇక విగ్నేష్ శివన్‌తో అతిసన్నిహితంగా వ్యవహరిస్తున్నప్పటికీ తన మనసులో మాట ఎప్పుడూ బయటపెట్టలేదు. ఒక బహిరంగ వేదికపై ఆయన నాకు కాబోయే భర్త (ఫియాన్సీ) అని నయన ప్రకటించడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. దాంతో వారిద్దరి మధ్య రిలేషన్‌కు మీడియాకే కాదు.. అభిమానులకు కూడా ఫర్‌ఫెక్ట్ సమాధానం అందించినట్టు నయనతార స్పష్టం చేసింది.

 డేటింగ్‌కు అంకురార్పణ

డేటింగ్‌కు అంకురార్పణ

నయనతార జీవితంలో కీలకమైన సమయంలో నానుమ్ రౌడీ ధాన్ అనే చిత్రంతో గొప్ప విజయాన్ని అందించాడు దర్శకుడు విగ్నేష్ శివన్. అప్పటి నుంచి వారి మధ్య ఓ బంధం ఏర్పడింది. ఆ బంధం ప్రస్తుతం విడదీయలేని అనుబంధంగా మారింది. 2018లోనే వీరిద్దరి పెళ్లి జరిగే అవకాశం ఉందట.

ఈ ఏడాది పెళ్లి భాజాలు

ఈ ఏడాది పెళ్లి భాజాలు

ఆరమ్ (కర్తవ్యం) సినిమా తర్వాత నయన్, గ్యాంగ్ చిత్రం తర్వాత విగ్నేష్ శివన్ కలిసి విహార యాత్ర కోసం అమెరికా వెళ్లారు. అక్కడ సేదతీరిన తర్వాత ఇటీవలనే చెన్నైకి వచ్చారు. ఆ తర్వాత వారి పనుల్లో బిజీగా మారారు. ఈ ఏడాదే నయన్, విగ్నేష్ పెళ్లి భాజాలు మోగడం ఖాయమనే మాట సినీవర్గాలకు, మీడియాకు ఉత్తేజకరమైన వార్తగా మారింది.

English summary
Vignesh Shivan gave Nayantara, the biggest hit of her career, Naanum Rowdy Dhaan, post her comeback. It is said that the two started dating each on the sets of the film. The film turned out to be a milestone in both their careers. Calling Vignesh her 'fiancé' is indeed the first time that Nayanthara has openly admitted to her relationship on a public forum. This has sparked rumours about the couple tying the knot sometime in 2018.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X