For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఈ హీరోయిన్ చిన్నప్పటి వీడియో చూస్తే ...మీరు ఆశ్చర్యపోవటం ఖాయం, అప్పట్లోనే....

  By Srikanya
  |

  హైదరాబాద్: టాలెంట్ అనేది కొందరు చిన్నప్పటినుంచి కనపరుస్తూంటారు. చిన్నప్పుడు వాళ్ళు ఏ విషయంలో ఆసక్తి చూపించి, టాలెంట్ చూపుతున్నారో అందులో నైపుణ్యం పెంచితే వారు పెద్ద స్దాయికి వెల్తారు. పుట్టుకతోటే వారికి వచ్చిన ప్రతిభను వెలికితీయటంలోనే తల్లితండ్రల ప్రతిభ ఏంటో తెలుస్తోంది. వారే సరైన పేరెంట్స్ అని చెప్పాలి.

  ఈ విషయంలో మళయాళి నటి నజ్రిమా నజిమ్ అదృష్టవంతురాలే అని చెప్పాలి. ఆమె చిన్నప్పుడు పాట పాడిన వీడియో ఒకటి ఇప్పుడు బయిటకు వచ్చి సోషల్ మీడియాలో సంచలనం క్రియేట్ చేస్తోంది. ఆ వీడియోని మీరు ఈ క్రింద చూడవచ్చు.

  నజ్రియా నజిమ్‌.. మల్లూవుడ్‌, కోలీవుడ్‌ల్లో అరంగేట్రం చేసిన కొంత కాలంలోనే టాప్‌ రేంజికి వెళ్లిపోయిన ముద్దుగుమ్మ. ఈ ఏడాది అటు మళయాళంలో, ఇటు తమిళంలో కలిపి ఆమె నటించిన అరడజను సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకట్రెండు మినహా సూపర్‌హిట్లే. ఈ ముద్దుగుమ్మ ఆ మధ్యన వివాహం చేసుకుని సినిమాలకు బై చెప్పింది. అయితే అతి త్వరలో మళ్లీ ఆమె రీఎంట్రీ ఇచ్చే అవకాసం ఉందంటున్నారు.

  స్లైడ్ షోలో ...నజ్రియా చిన్నప్పటి ఫెరఫార్మెన్ వీడియోతో పాటు మరిన్ని విశేషాలు..

   ఈమె సక్సెస్ చూస్తే కళ్లు తిరుగుతాయి

  ఈమె సక్సెస్ చూస్తే కళ్లు తిరుగుతాయి

  అతి తక్కువ నటనా కాలంలో నజ్రియా తెచ్చుకున్నంత పేరు మరొకరు తెచ్చుకోలేదనే చెప్పాలి. ఆమె యువ హృదయాలను తన నటన విన్యాసాలతో ఆకట్టుకుంది. ఆమె ఫేస్ బుక్ లో అతి తక్కువ కాలంలో ఐదు మిలియన్ లైక్స్ తెచ్చుకున్న హీరోయిన్ గా నిలిచింది. అలాగే ఓ పాపులర్ న్యూస్ పేపర్ నిర్వహించిన పోల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ఇండియన్ సెలబ్రెటీల్లో ఒకరిగా ఆమె నిలిచింది.

   పుట్టింది అక్కడ, బాల్యాన్ని ఇక్కడ

  పుట్టింది అక్కడ, బాల్యాన్ని ఇక్కడ

  నజ్రియా డిసెంబర్ 20, 1994లో నిజాముద్దీన్, బీగమ్ బీనా దంపతులకు పెద్ద కుమార్తెగా జన్మించింది. కేరళలోని త్రివేండ్రమ్ లో జన్మించిన ఆమెకు ఓ సోదరుడు ఉన్నారు. అతని పేరు నవీన్. ఆమె తన చదువుని త్రివేండ్రమ్ లోని క్రీస్ట్ నగర్ స్కూల్ లోనూ యు ఎ ఈ లోని అవర్ ఓన్ ఇంగ్లీష్ హై స్కూల్ లో చదువు పూర్తి చేసింది. తొలిరోజుల్లో ఆమె యాంకర్ గా టీవిల్లో చేసింది. ఆమె చైల్డ్ హుడ్ డేస్ ని బాగా ఎంజాయ్ చేసానంటుంది

  rn

  చిన్నప్పుడే మొదలెట్టింది

  నజ్రియా...చైల్డ్ ఆర్టిస్ట్ గా...బ్లెస్సీ దర్శకత్వంలో వచ్చిన పులుంకు చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో ఆమె ముమ్మట్టి కుమార్తెగా కనిపించింది. ఆ సినిమాలో నజ్రియాకు చాలా మంచి పేరు వచ్చింది. చాలా పాజిటివ్ రివ్యూలు ఆమె నటనకు వచ్చాయి. ఆ తర్వాత ఆమె మరో నాలుగేళ్ల తర్వాత ముమ్మట్టి చేసిన పరమణిలో చేసింది. ఆ తర్వాత మోహన్ లాల్ చిత్రం ఒరు నాల్ వరుమ్ చిత్రం చేసింది.

   కెరీర్ లో అది పెద్ద మలుపు ఇదే

  కెరీర్ లో అది పెద్ద మలుపు ఇదే

  నజ్రియా కెరీర్ లో పెద్ద టర్నింగ్ పాయింట్ ఏమిటీ అంటే..యుహ్ పేరుతో చేసిన ఓ వీడియో ఆల్బమ్. ఆల్ఫోన్సా చేసిన ఆ వీడియో ఆల్బమ్ ఓ రేంజిలో క్రేజ్ తెచ్చి పెట్టింది. అందులో నవీన్ పోలి సరసన చేసింది. అక్కడ నుంచి ఆమె ప్రస్దానం మొదలైంది. ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. తన అందం, నటనతో ఆకట్టుకుని దూసుకుపోయింది.

   ఆ ఆల్బమ్ లేకపోతే ...నజ్రియా లేదు

  ఆ ఆల్బమ్ లేకపోతే ...నజ్రియా లేదు  అలాగే నజ్రినా ..మ్యాడ్ డాడ్ చిత్రంలో లీడ్ రోల్స్ వేయటం మొదలెట్టింది. అయితే ఆమెకు నేరం చిత్రంతోనే పేరు వచ్చింది. తనకు పేరు తెచ్చి పెట్టిన ఆల్బమ్ యుహ్ టీమ్ తో చేసిన ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఆమె తమిళంలో రాజా రాణి, నెయ్యంది చిత్రాలు చేసింది. అక్కడా అద్బుతమైన నటి అనే పేరు తెచ్చుకుంది. ఆమె నటనకు వీరాభిమానులు అంతటా ఏర్పడ్డారు.

   2014 స్పెషల్ ఇయిర్ ఎందుకంటే

  2014 స్పెషల్ ఇయిర్ ఎందుకంటే

  నజ్రియా జీవితంలో 2014 ఓ కీలకమైన మలుపు తెచ్చిన సంవత్సరం అని చెప్పాలి. ఆమె ఆ సంవత్సరాన్ని ఓ స్పెషల్ గా పరిగణిస్తాను అని చెప్తుంది. ఎందుకంటే ప్రొపెషనల్ గానే కాక పర్శనల్ గానూ ఆమె జీవితంలో చాలా మార్పులు తెచ్చిన సంవత్సరం అది. ఓం శాంతి ఓహానా, బెంగుళూరు డేస్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఆమె లీడ్ రోల్స్ చేసింది ఆ సంవత్సరమే. అలాగే బెంగుళూరు డేస్ చిత్రంలో నటించిన తన సహ నటుడు ని పెళ్లాడింది ఆ సంవత్సరమే.

  rn

  చిన్నప్పటి ఫెరఫార్మెన్స్ వీడియో ఇదే

   ఆత్మీయమైన జంట ఇది

  ఆత్మీయమైన జంట ఇది

  తెరపై జంటగా నటించిన మలయాళ తారలు ఫాహద్‌ ఫాజిల్‌, నజ్రియా నజీమ్‌ నిజ జీవితంలోనూ జంటగా మారారు. తిరువనంతపురంలో ఆ ఇద్దరి ‘నిఖా' జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు, స్నేహితులు, సినీ రంగానికి చెందిన కొద్దిమంది ప్రముఖులు హాజరయ్యారు. అన్ని సినిమా పెళ్లిళ్లలా కాకుండా వీళ్లిద్దరూ డీప్ గా ప్రేమించుకుని, పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు.

  మామగారు పెద్ద స్టార్ డైరక్టర్

  మామగారు పెద్ద స్టార్ డైరక్టర్

  పేరుపొందిన దర్శకుడు ఫాజిల్‌ కుమారుడైన ఫాహద్‌, నజ్రియా నాలుగేళ్ల క్రితం ‘ప్రమాణి' సినిమా సెట్స్‌పై ప్రేమలో పడ్డారు. పెళ్లాడాలని నిర్ణయించుకున్న ఆ ఇద్దరికీ ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం జరిగి, తర్వాత పెళ్లి చేసుకున్నారు. తండ్రి ఫాజల్‌ డైరెక్షన్‌లోనే హీరోగా 2002లో హీరోగా పరిచయమైన ఫాహద్‌ క్రమక్రమంగా తన విలక్షణ నటనతో, విభిన్నమైన పాత్రలతో సెన్సేషనల్‌ యాక్టర్‌గా పేరుపొందాడు. అనేక అవార్డులు సొంతం చేసుకున్నాడు.

   విభిన్నమైన ఎక్సప్రెషన్, ప్రక్కింటి పిల్లలా

  విభిన్నమైన ఎక్సప్రెషన్, ప్రక్కింటి పిల్లలా

  'బెంగుళూరు డేస్', 'రాజా రాణి' వంటి చిత్రాల్లో తన చిలిపిదనంతో కూడిన అమాయకమైన నవ్వుతో యువ హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకొన్న హీరోయిన్నజ్రియా.. కెరీర్ తొలినాళ్లలోనే తన సహ నటుడు 'ఫాహాద్ ఫసిల్'ను వివాహమాడి సినిమాలకు స్వస్తి పలికింది. అయితే.. ఇటీవల ఓ మాస పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తిరిగి రీ ఎంట్రీ ఇస్తానని చెప్పింది

   జారిపోతాడనే తొందరపడ్డానంటోంది

  జారిపోతాడనే తొందరపడ్డానంటోంది

  నజ్రియా ను 'ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి?' అని సదరు విలేఖరి ప్రశ్నించగా.. 'ఫాహద్ ఎక్కడ దూరం చేసుకొంటానో అన్న భయంతోనే స్టార్ డమ్ ను కెరీర్ ను పక్కనపెట్టి పెళ్లి చేసేసుకొన్నాను' అని సమాధానమిచ్చింది. ప్రేమించిన మనిషి కోసం కెరీర్ ను సైతం త్యాగం చేసిన నజ్రియాను మన హీరోయిన్లు కూడా దృష్టిలో ఉంచుకొని.. ఇకనైనా పెళ్లిపై ఆసక్తి చూపుతారేమో చూడాలి అంటున్నారు మీడియా జనం.

   విమర్శలు వచ్చాయి...

  విమర్శలు వచ్చాయి...

  ఇక నజ్రియా టీవీ యాంకర్‌గా రాణించి, సినిమాల్లో అడుగుపెట్టి మలయాళ, తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. తమిళంలో ‘రాజారాణి', మలయాళంలో ‘బెంగుళూర్‌ డేస్‌' సినిమాలు అందుకు మంచి ఉదాహరణ. ఆమెకు స్టార్ డమ్ వచ్చి వెలుగుతున్న రోజుల్లో వివాహం చేసుకోవటం చాలా మందిని బాధపెట్టింది. మంచి నటిని కోల్పోయింది అన్నారు. అయితే నజ్రియా వాటిని లెక్క చేయలేదు.

  ఆ ఒక్క ఫొటోతోనే రికార్డ్ క్రియేట్

  ఆ ఒక్క ఫొటోతోనే రికార్డ్ క్రియేట్

  అప్పుడే పెళ్లి చేసుకుంటోందా అని విమర్శించిన వాళ్లే , ఆమె భర్తతో పెట్టిన సెల్ఫీ ఫొటో చూసి వరసపెట్టి లైక్ లు కొట్టేసి తమ అభిమానాన్ని చాటారు. ఫేస్ బుక్ లో లక్షకు పైగా లైక్ లను ఆ ఫొటో సొంతం చేసుకుని ఆమె అభిమానులు ఏ రేంజిలో ఉన్నారో చెప్పింది. ఆ ఒక్క ఫొటో తోనే ఆమె అభిమానుల నుంచి గ్రీన్ సిగ్నల్ పొందింది అంటూ మీడియా ఆమెను ఎత్తేసింది.

   టైటిల్ లోనూ నిఖా ఉందా సినిమాకు

  టైటిల్ లోనూ నిఖా ఉందా సినిమాకు

  భగత్ పాజిల్, నజ్రియాల వివాహం కేరళ లోని తిరువనంతపురంలో ముస్లింల వివాహ సంప్రదాయం ప్రకారం జరగింది. వీరి వివాహ రిసెప్షన్ 24వ తేదీన ఆలప్పుళాలో జరగింది. తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈ వివాహానికి హాజరు అయ్యారు. నజ్రియా నిశ్చితార్థంతోనే నటనకు ఫుల్‌స్టాప్ పెట్టారు. తమిళంలో ఆమె నటించిన తిరుమణం ఎనుమ్ నిఖా చివరిగా విడుదలయింది.

   సరదాపోయి కేసులో ఇరుక్కుంది

  సరదాపోయి కేసులో ఇరుక్కుంది

  ఇక ఆ మధ్యన నజ్రియా నజ్రిమ్ మరో హీరోయిన్ రంజని హరిదాస్ తో చేసిన సరదా కోర్టు కేసు వరకు వెళ్ళింది. వీళ్లిద్దరూ కలిసి కోడండ్ లో ఓ ఏనుగు పైకి ఎక్కు స్వారీ చేసారు. వీరి టైం బ్యాడ్ కాకపోతే ఆ రెండు ఏనుగులు స్టేట్ ఫారెస్ట్ శాఖ వారివి కావడంతో ఇప్పుడు ఇదో తలనోప్పిలా తయారయ్యింది. ఈ విషయం పై కంప్లైంట్ వెళ్ళడం తో ఏనిమల్ వెల్ఫేర్ బోర్డ్ అధికారులు వారిపై యాక్షన్ తీస్కోడానికి రెడీ అయ్యారు. కాకపోతే పాటు ఏనిమల్ వెల్ఫరె బోర్డ్ అధికారులు కుడా ఇరుక్కున్నారు. హైకోర్టు ఆర్డర్ ప్రకారం అనుమతి లేనిదే ఎవరు ఎనుగులపై స్వారీ చేయకుదడనేది రూల్. మన హీరోయిన్స్ ఇద్దరు ఆ రూల్ ను అతిక్రమించి ఎనుగులపై స్వారీ చేసారు. దాంతో వీరిపై కేసు నమోదు చేసారు.

   పెద్ద గొడవే చేసింది

  పెద్ద గొడవే చేసింది

  నజ్రియా నజీమ్ వార్తలో వ్యక్తిగా మారింది. అందుకు కారణం ఆమె నడిరోడ్డుపై వీరంగం సృష్టించడమే. తన ఖరీదైన రేంజ్ రోవర్ కారును నడుపుకుంటూ వస్తున్న సమయంలో ఏదో వాహనం తగిలి కారు పేయింటు కాస్త గీసుకుపోయినట్లు అయింది. దీంతో అగ్గిమీద గుగ్గిలంలా చిటపటలాడింది నజ్రియాం. ఓ రకంగా ఆమె వీరంగమే సృష్టించిందని చెప్పొచ్చు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తున్నాయి.

   బొడ్డు గురించి గోల గోల చేసింది

  బొడ్డు గురించి గోల గోల చేసింది

  తమిళంలో ధనుష్‌తో నటించిన ఓ సినిమాలో బొడ్డు సీన్ విషయంలో రచ్చరచ్చ చేసి వివాదాస్పద హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఈడిగారు బొడ్డు సీన్ విషయంలో చేసిన రచ్చను నయనతార తప్పుబట్టగా... 'నాపై కామెంట్స్ చేయడానికి నయనతార ఎవరు? నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. నాకు ఆమె సలహాలు అవసరం లేదు. నయనతార ఎలాంటిదో(రియల్ లైఫ్‌లో) అందరికీ తెలుసు, నన్ను విమర్శించే అర్హత ఆమెకు లేదు' అంటూ నజ్రియా మండి పడింది. ఇది జరిగి చాలా కాలం అయంది. మళయాల నటుడైన ఫహాద్ ఫాజిల్‌ను పెళ్లాడినప్పటి నుండి నజ్రియా సినిమాలకు దూరంగా ఉంటోంది.

  English summary
  Nazriya Nazim, the charming actress is currently staying away from the films to concentrate on family life. Nazriya singing with cute and beautiful expressions . Actress is a awesome singer from childhood.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X