»   » హార్ట్ టచింగ్ మూవీ: ‘నీదీ నాదీ ఒకే కథ’పై ఆడియన్స్ ట్విట్టర్ టాక్

హార్ట్ టచింగ్ మూవీ: ‘నీదీ నాదీ ఒకే కథ’పై ఆడియన్స్ ట్విట్టర్ టాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీవిష్ణు కథానాయకుడిగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నీదీ నాదీ ఒకే కథ'. సాత్నా టిటుస్ హీరోయిన్. శుక్రవారం గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్, టీజర్ విడుదలైనప్పటి నుండే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి, ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా చాలా బావుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు.

ప్రతి విద్యార్ధి చూడాల్సిన చిత్రం...మనందరి కథ !!

తప్పకుండా చూడాల్సిన సినిమా

హీరో శ్రీవిష్ణు కెరీర్లో ‘నీదీ నాదీ ఒకే కథ' ఒక ఉత్తమ చిత్రం. అతడి పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. నిజ జీవితానికి సంబంధించిన ఎన్నో నగ్నసత్యాలు చెప్పిన చిత్రం. దర్శకుడు వేణు ఉడుగుల స్క్రిప్టు వర్క్ అద్భుతం. హ్యూమన్ ఎమోషన్స్‌తో కూడిన సినిమా. తప్పకుండా చూడాల్సిన సినిమా... అంటూ ఓ సినీ అభిమాని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

స్టోరీ టెల్లింగ్ బావుంది

నీదీ నాది ఒకే కథ చిత్రం మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ప్రేక్షకుడిని మొదటి నుండి చివరి వరకు సీట్లకు అతుక్కుపోయేలా చేసింది. ఇండియన్ సినిమాల్లో ఇలాంటివి చాలా రేర్ గా వస్తుంటాయి. దర్శకుడు వేణు ఉడుగుల స్టోరీ టెల్లింగ్ బావుంది... అని మరొకరు తన అభిప్రాయం వెల్లడించారు.

ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు

సినిమా చాలా బావుంది. మన నిజ జీవితంలోని సంఘటనలకు అద్దం పట్టేలా ఉంది. దర్శకుడు వేణు ఉడుగుల పనితీరు సూపర్. శ్రీవిష్ణు పెర్ఫార్మెన్స్ చాలా బావుంది... అని మరో అభిమాని వెల్లడించారు.

నిజ జీవితానికి దగ్గరగా..


‘నీదీ నాదీ ఒకే కథ' సినిమా కథ, పాత్రలు, డైలాగులు ప్రతి ఒక్కటి నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంది. శ్రీ విష్ణు తన నేచురల్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాను తన భుజాలపై మోశారు. రోటీన్ కమర్షియల్ సినిమాల్లా కాకుండా కొత్తగా, రియలిస్టిక్‌గా ఉంది... అంటూ మరో అభిమాని తెలిపారు.

English summary
Director Udugula Venu's Telugu movie Needi Naadi Oke Katha (NNOK) starring Sree Vishnu, Satna Titus and Nara Rohith has received positive reviews and ratings from the audiences.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X