»   » ఆగస్టు 1న నీలకంఠ ‘మాయ’

ఆగస్టు 1న నీలకంఠ ‘మాయ’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: షో, మిస్సమ్మ, విరోధి వంటి వైవిధ్యమైన చిత్రాలకు దర్శకత్వం వహించి పలు జాతీయ, నంది అవార్డులను అందుకున్న దర్శకుడు నీలకంఠ తన తదుపరి చిత్రం 'మాయ'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హర్షవర్దన్ రాణే, అవంతి, సుష్మారాజ్, నందినీరాయ్ నటీనటులు,

షిర్డి సాయి కంబైన్స్ పతాకంపై ఎం.వి.కె.రెడ్డి-మధుర శ్రీధర్ సంయుక్తంగటా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మనుషుల్లో ఉండే అతేంద్రీయ దృష్టి(ఎక్స్‌ట్రా సెన్‌సరి పెర్ సెప్షన్) నేపథ్యంలో వైవిధ్యమైన స్క్రీన్ ప్లేతో సాగే థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాను. కొత్త కథాంశాలతో వచ్చే చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. మాయ సినిమా కథ, కథనం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలగజేస్తుంది అని నీలకంఠ తెలిపారు.

Neelakanta's 'Maaya' releasing on August 1st

నీలకంఠతో దర్శకత్వంలో ఇంత మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు గర్వపడుతున్నాను. శేఖర్ చంద్ర సంగీతం, నవీన్ నూలి ఎడిటింగ్, బాల్ రెడ్డి ఫోటోగ్రఫీ సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టు 1న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మధుర శ్రీధర్ రెడ్డి తెలిపారు.

నాగబాబు, ఘాన్సీ, అనితా చౌదరి, వేణు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: గొట్టపల్లి బాబ్జీ, ప్రొడక్షన్ డిజైనర్: రమా.డి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎ.మధుసూదర్ రెడ్డి, పబ్లిసిటీ డిజైనర్: శ్రీయాడ్స్ ఈశ్వర్, పిఆర్ఓ: జి.శ్రీనివాస్(జీఎస్ మీడియా), కెమెరా ఎక్విప్మెంట్: 24 కారెట్ సాయిచరణ్ రెడ్డి, డిఐ: అన్నపూర్ణ స్టూడియోస్, క్యాస్టింగ్ ఏజెన్సీ: మురళీ కృష్ణ.

English summary
he release date of National award winning director Neelakanta's upcoming thriller movie, 'Maaya' has been confirmed. The film is set for a release on August 1st.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu