»   » పవన్ కళ్యాణేమో చెల్లిలా, ఆమె మాత్రం దేవుడిలా..!

పవన్ కళ్యాణేమో చెల్లిలా, ఆమె మాత్రం దేవుడిలా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధారణంగా ఎవరీకీ అంతగా చనువు ఇవ్వరు. ఇస్తే వారి రేంజి మారినట్లే. అందుకు టాలీవుడ్లో చాలా మందిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆయనకు దగ్గర కావడానికి ఎంతో మంది ప్రయత్నిస్తే కొంత మంది మాత్రమే ఆయన్ను రీచ్ కాగలుగుతారు. అది వారి స్వభావం, ఆలోచించే తీరుపై ఆధారపడి ఉంటుంది.

అలాంటి వారిలో ఒకరు పంజా చిత్ర నిర్మాత నీలిమ తిరుమల శెట్టి. పవన్‌తో ఆమెకు ఎంత సాన్నిహిత్యం ఉందంటే....పవన్ కళ్యాణ్ ఆమెను తన చెల్లిలా చూసుకుంటారట. మెగా ఫ్యామిలీ ఆమెను కూతురులా చూసుకుంటారట. ఈ విషయాన్ని నీలిమ స్వయంగా వెల్లడించారు. 'పవన్ కళ్యాన్ నన్ను చెల్లెమ్మలా చూసుకుంటారు...కానీ నాకు ఆయన నాకు దేవుడికంటే ఎక్కువ' అని అంటున్నారు నీలిమ.

'పంజా' చిత్రం తర్వాత పవన్ సలహా మేరకు చిన్న సినిమాలపై దృష్టి సారించిన నీలిమ తిరుమలశెట్టి ప్రస్తుతం 'అలియాస్ జానకి' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. చిరంజీవి మేనమామ కొడుకు అయిన వెంకట్ రాహుల్ 'అలియాస్ జానకి' చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నారు. దయా.కె. దర్శకుడు.

ఇటీవల చిరంజీవి తల్లి అంజనాదేవితో ఆ చిత్రం ఆడియో సీడీలు విడుదల చేయించారు. నాగబాబు, తనికెళ్ల భరణి, శివ నారాయణ, భరణి శంకర్, శత్రు, వంశీ రెడ్డి, రమేష్ వేంపల్లి, మీనా కుమారి తదితరులు ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్, కెమెరా: సుజిత్ సారంగ్, ఎడిటర్: శ్రీజిత్ సారంగ్, ఆర్ట్: హరి వర్మ, నృత్యాలు: దయా.కె, వంశీ కాట్రోజు, యాక్షన్: దయా.కె., సుజిత్ సారంగ్, మాటలు: వంశీ కృష్ణ గద్వాల, వశిష్ట శర్మ, అర్జున్, సుమన్ చిక్కల, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: దయా.కె., సహ నిర్మాత: విక్రమ్.ఎస్.

English summary
'Pawan Kalyan treats me as his sister and he is more than God to me', Producer Neelima Tirumalasetti who earlier produced 'Panjaa' said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu