»   » ఈ ఖైదీ కి నంబర్ లేదట... నితిన్ ఇలా జైలు యూనిఫారం లో

ఈ ఖైదీ కి నంబర్ లేదట... నితిన్ ఇలా జైలు యూనిఫారం లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

నితిన్‌ 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అందాల రాక్షసి , కృష్ణగాడి వీరప్రేమగాథ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలు తెరకెక్కించిన హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ప్రొడక్షన్‌ నెం.9గా నిర్మిస్తున్న కొత్త చిత్రం సెప్టెంబర్‌ 8న పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

ఈ చిత్రం ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. హైదరాబాద్ లో కొన్ని షెడ్యూల్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆ తర్వాత యూఎస్ లోని అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకోనుంది. మే నెల వరకు ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఆ తర్వాత పవన్ నిర్మాణంలో రూపొందనున్న సినిమాను చేయాలనే ఆలోచనలో ఉన్నాడు నితిన్.

Neeraja Kona often shares information about Nitin's new movie.

ఈ సినిమా పేరు లై (LIE). లైఫ్ ఈజ్ ఎండ్లెస్ అనే కాన్సెప్టుతో రూపొందుతోంది. ఈ సినిమాలో ఒక సీన్లో నితిన్ ఖైదీగా కూడా కనిపిస్తాడట. ఖైదీ డ్రెస్ లో వున్న నితిన్ .. శిథిలావస్థలో వున్న ఒక ఇంటి గుమ్మంలో నుంచి అవతలికి చూస్తున్నట్టుగా ఈ ఫోటో వుంది. ఈ ఫోటో ఈ సినిమా కథ .. కథనాలపై ఆసక్తిని పెంచుతోంది. అదే ఫోటోను ఇప్పుడు డిజైనర్ నీరజా కోన షేర్ చేసింది.

ఆ సందర్భంగా ఇతను ఖైదీ నెంబర్ లెస్ అంటూ సరదాగా కామెంట్ చేసింది కూడా. అయితే ఈ సినిమాలో నితిన్ అసలు ఖైదీగా ఎందుకు కనిపిస్తున్నాడు.. ఇది లవ్ స్టోరీయేనా లేకపోతే ఇంకేదైనా స్టోరీయా అంటూ అందరూ స్టన్ అయిపోతున్నారు. అయితే ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ పిక్ షేర్ చేస్తూ ఖైదీ నెంబర్ లెస్ అనే కామెంట్ పెట్టింది. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెం 150 కి సంబంధించి లీకైన తొలి ఫోటోలో చిరు ఖైదీ డ్రెస్ తో కనిపించిన సంగతి తెలిసిందే.

English summary
Apparently designer Neeraja Kona often shares information about her friends like Samantha and Nitin quite regularly. And this time she gave an insight into Nitin's new movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu