twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కథలో రాజకుమారి’ టాక్ దారుణంగా, హీరోలు కూడా దూరంగా....

    కథలో రాజకుమారిపై నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదంటున్నారు.

    By Bojja Kumar
    |

    Recommended Video

    Negative Public Talk On Nara Rohith's Kathalo Rajakumari

    కొన్ని సినిమాలకు చిత్రీకరణ దశలోనే రిజల్ట్ తెలిసిపోతుంది. అయితే అప్పటికే సినిమాకు పెట్టాల్సిన ఖర్చంతా పెట్టి, చేయాల్సిన షూటింగ్ అంతా పూర్తవుతుంది. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కాదని తెలిసినా కమిట్ అయ్యాం కాట్టి నటీనటులు, మొదలు పెట్టాక పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దర్శక నిర్మాతలు ఏదో అలా సినిమాను పూర్తి చేసిన బాక్సాఫీసు వరకు తీసుకొస్తారు. వర్కౌట్ కాదని ముందే తెలుసు కాబట్టి.... దర్శకుడు, హీరో, లేదా నిర్మాతలు సినిమాను ప్రమోషన్లు చేయడానికి కూడా ఇష్టపడరు.

    తాజాగా విడుదలైన 'కథలో రాజకుమారి' సినిమా పరిస్థితి కూడా ఇదే అని స్పష్టం అవుతోంది. నారా రోహిత్‌, నాగశౌర్య, నమితా ప్రమోద్‌, నందిత ప్రధాన పాత్రధారులుగా మహేష్‌ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది.

    ప్రమోషన్లకు దూరంగా హీరోలు

    ప్రమోషన్లకు దూరంగా హీరోలు

    నారా రోహిత్, నాగ శౌర్య లాంటి హీరోలు తమ సినిమా విడుదలవుతుందంటే.... కనీసం వారం రోజుల ముందు నుండే ప్రమోషన్లలో బిజీ అయిపోతారు. టీవీ ఇంటర్వ్యూలు, పేపర్ ఇంటర్వ్యూలతో కాస్త హడావుడి చేస్తారు. అయితే ‘కథలో రాజకుమారి' సినిమా విషయంలో వారు ప్రమోషన్లకు పూర్తిగా దూరంగా ఉండటం గమనార్హం.

    పూర్ రిలీజ్, తక్కువ షోస్

    పూర్ రిలీజ్, తక్కువ షోస్

    సినిమా వర్కౌట్ కాదని నిర్మాతలు ముందే ఊహించినట్లు ఉన్నారు.... సినిమా రిలీజ్ కూడా చాలా పూర్ గా ఉంది. హైదరాబాద్ ఏరియాలో ఈ సినిమా విడుదలైన పాతిక చోట్ల కూడా పూర్తి షోలు వేయడం లేదు. దాదాపు అన్ని చోట్ల రెండు షోలకు మించి పడలేదు.

    టాక్ దారుణంగా

    టాక్ దారుణంగా

    ఇక ఈ సినిమా చూడటానికి వెళ్లి కొద్దిమంది కూడా సినిమా చాలా బోరింగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇది సినిమాలా లేదని, టెలీ సీరియల్ కంటే దారుణంగా ఉందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

    సినిమా కథ

    సినిమా కథ

    సినిమాల్లో విలన్ వేషాలు వేసే అర్జున్(నారా రోహిత్) సినిమాల్లోనే కాదు... నిజ జీవితంలోనూ విలన్ మనస్తత్తవం ఉన్న వ్యక్తి. అహంకారం, కోపంతో ఉండే అర్జున్ ఓ సంఘటనతో చాలా మారిపోతాడు. చివరకు తను నటించే సినిమాల్లో కూడా విలనిజాన్ని చూపించలేనంతగా మారిపోతాడు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితులలో ఉన్న అర్జున్‌కి ఓ వ్యక్తి సలహా ఇస్తాడు.. నీకు శత్రువుగా ఉన్న వ్యక్తి దగ్గర నీ క్రూరత్వం చూపించు అంటాడు. అలా అర్జున్ తన చిన్న నటి స్నేహితురాలు సీత (నమిత ప్రమోద్)ను తన శత్రువుగా ఎంచుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది మిగతా స్టోరీ. ఈ సినిమాలో నాగ శౌర్య కూడా హీరో పాత్రలోనే కనిపించాడు.

    డైరెక్టర్ మీదే విమర్శలు

    డైరెక్టర్ మీదే విమర్శలు

    హీరో నారా రోహిత్, నాగ శౌర్యలతో పాటు నిర్మాతలను కథ చెప్పేటపుడు ఇంప్రెస్ చేసిన దర్శకుడు మహేష్ సూపరనేని.... సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో ఫెయిల్ అయ్యాడని టాక్. ఈ సినిమా ఫలితం ముందే ఊహించిన నారా రోహిత్, నాగ శౌర్య సినిమా ప్రమోషన్లకు కూడా దూరంగా ఉన్నారు.

    సినిమా ఎవరికీ కనెక్ట్ అయ్యేలా లేదట

    సినిమా ఎవరికీ కనెక్ట్ అయ్యేలా లేదట

    అసలు ఈ సినిమా ఏ వర్గం ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా లేదని, కథ కాస్త డిఫరెంటుగా ఉన్నా సినిమా ప్రేక్షకరంజకంగా తెరకెక్కించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని అంటున్నారు. నారా రోహిత్ తన కెరీర్లో చేసిన అతి పెద్ద మిస్టేక్ అని ఫీలయ్యే సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్నారట.

    Read more about: kathalo rajakumari tollywood
    English summary
    Negative public talk on Nara Rohith's Kathalo Rajakumari movie. Kathalo Rajakumari is an utterly nonsensical film for any kind of audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X