»   » హీరోయిన్ నేహాకి చేదు అనుభవం: ఆక్సిడెంట్ అయితే సహాయం మరిచి, సెల్ఫీలు దిగారు

హీరోయిన్ నేహాకి చేదు అనుభవం: ఆక్సిడెంట్ అయితే సహాయం మరిచి, సెల్ఫీలు దిగారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం నడుస్తున్న సెల్ఫీల యుగంలో సమయమూ సందర్భమూ ఏదీ లేకుండా సెల్పీకి దిగుతున్నారు. గతం లో నటుడు ప్రకాశ్ రాజ్ కి, కమేడియన్, హీరో సునీల్ కీ ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. తనని రక్షించటం పక్కకు ప్ర్ట్టి సెల్ లో తన ఫొటోలని తీస్తున్న జనాన్ని చూసి దిగ్బ్రాంతికి లోనయ్యాను అని ప్రకాశ్ రాజ్ చెబితే, ఒక పక్కరక్తం కారుతున్నా సెల్ఫీ తీజ్సుకోబోయిన వ్యక్తిని కసురుకొని అవతలికి తోలేసాడట సునీల్. ఇప్పుడు బాలీవుడ్ నటి, మన టాలీవుడ్ లో కూడా రాజ శేఖర్, బాల కృష్ణల సరసన హీరోయిన్ గా చేసిన నేహా దుపియా కి కూడా అలాంటి అనుభవమే ఎదురయ్యిందట.

Neha Dhupia Photo Gallery

బాలకృష్ణ సరసన ‘పరమవీరచక్ర'

బాలకృష్ణ సరసన ‘పరమవీరచక్ర'

టాలీవుడ్ హీరో బాలకృష్ణ సరసన ‘పరమవీరచక్ర' సినిమాలో తళుక్కున మెరిసిన బాలీవుడ్ భామ నేహా ధూపియాకు ఇటీవల అభిమానుల నుంచి ఇటువంటి అనుభవం ఎదుదైంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నేహా ధూపియా ప్రయాణిస్తున్న కారు.. చంఢీఘడ్‌లో యాక్సిడెంట్‌కు గురైంది. దీంతో అక్కడ గుమిగూడిన జనం.. ప్రమాదం నుంచి ఆమెను రక్షించే బదులు ఆమెతో సెల్ఫీలు దిగడం ప్రారంభించారు.

Neha Sharma's Obscene Figure in Photoshoot : GQ India Magazine March 2017 - Filmibeat Telugu
కళ్లద్దాలు పగిలిపోయాయి

కళ్లద్దాలు పగిలిపోయాయి

వివరాల్లోకి వెళితే నేహా ఒక ఆడియో ఫంక్షన్ కోసం చండీఘడ్ వెళ్లారు. తిరిగివస్తున్న సమయంలో ఆమె కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఆమె కళ్లద్దాలు పగిలిపోయాయి. రోడ్డు మధ్యన ఈ ప్రమాదం జరగడంతో ఆ రోడ్డు మీదుగా వెళుతున్న వాహనాలన్నీ అక్కడ నిలిచిపోయాయి. వారంతా తమ అభిమాన నటి నేహాను గుర్తుపట్టారు.

సహాయం చేయకుండా

సహాయం చేయకుండా

అయితే వారు ఆమెకు సహాయం చేయడం పోయి.. ఆమెకు మరింతగా దగ్గరగా జరిగి సెల్పీలు, ఆటో‌గ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. ఈ ప్రమాదంలో నేహాకు గాయాలు కాకపోయినప్పటికీ, అక్కడ గుమిగూడిన జనంతో తీవ్ర అవస్థలు పడ్డారు. నేహా పిఆర్ఓ చెప్పిన వివరాల ప్రకారం నేహా ప్రయాణిస్తున్నకారు బ్రేకులు పనిచేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది.

సెల్ఫీలతో పాటు ఆటో‌గ్రాఫ్‌లు

సెల్ఫీలతో పాటు ఆటో‌గ్రాఫ్‌లు

దీంతో అరగంట పాటు నేహా.. జనం మధ్యలోనే ఉండిపోయి వారికి సెల్ఫీలతో పాటు ఆటో‌గ్రాఫ్‌లు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో కారు వచ్చాక ఊపిరి పీల్చుకుంటూ ఎయిర్ పోర్టుకు ప్రయాణమయ్యిందట పాపం నేహ. నిజంగా మనుషులు మరీ కౄరంగా మారిపోతూ, కనీస భావోద్వేగాలకూ దూరంగా జరిగిపోతున్నారన్నది వాస్తవమే అనిపించటంలేదూ...

English summary
An injured Neha Dhupia gets troubled by onlookers who want pictures and autographs instead of helping her.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu