»   » ఆయనతో అఫైర్ లేదు.. డేటింగ్ చేస్తే ప్రెస్ మీట్‌ పెట్టి చెప్తా..

ఆయనతో అఫైర్ లేదు.. డేటింగ్ చేస్తే ప్రెస్ మీట్‌ పెట్టి చెప్తా..

Written By:
Subscribe to Filmibeat Telugu

అందాల ఆరబోతలో ముందున్నప్పటికీ అవకాశాలు దక్కని తారల్లో నేహా దూపియా ఒకరు. కేరీర్ పైనే కాన్సంట్రేషన్ చేయడం వల్లనే ఒంటరిగా ఉండాల్సి వస్తుందని ఆమె ఇటీవల మీడియాకు తెలిపింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను నేహా మీడియాతో పంచుకొన్నారు.

ఎవరితోనైనా డేటింగ్ చేస్తే

ఎవరితోనైనా డేటింగ్ చేస్తే

ప్రస్తుతం కెరీర్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ప్రేమలో పడి తిరగడానికి సమయం లేదు, గత రెండేళ్లుగా ఒంటరిగానే ఉంటున్నాను. ఒకవేళ ఎవరితోనైనా డేటింగ్ చేస్తే ప్రపంచానికి ఇట్టే తెలిసి పోతుంది. డేటింగ్ విషయం దాస్తే దాగేది కాదు అని నేహా పేర్కొన్నది.

ఎవరితోను అఫైర్ లేదు

ఎవరితోను అఫైర్ లేదు

ఓ ప్రముఖుడితో అఫైర్ ఉన్నట్టు వస్తున్న వార్తలను నేహా ఖండించింది. నాకు ఎవరితోను అఫైర్ లేదు అని స్పష్టం చేసింది. రెండేళ్లుగా నేను సింగిల్ గా ఉండటం చూసి ఫ్యాన్స్ ఆశ్యర్యపోతారు. ఒంటరిగా ఎలా ఉంటున్నావని ఎవరైనా అడిగితే.. నాకు సమయం లేదు అని చెప్తుంటాను అని నేహా చెప్పింది.

ఎవరితోనైనా ప్రేమలో పడితే

ఎవరితోనైనా ప్రేమలో పడితే

భవిష్యత్‌లో ఎవరితోనైనా ప్రేమలో పడితే మీడియాకు ప్రత్యేకంగా చెప్తాను. జీవితంలో అంతకంటే మంచి క్షణాలు ఏముంటాయి. మంచి విషయాన్ని ఆత్మీయులతో పంచుకోవడం కంటే మరోకటి ఏదైనా ఉంటుందా అని నేహా వెల్లడించింది.

ఎక్కువగా రిస్క్ తీసుకోను.

ఎక్కువగా రిస్క్ తీసుకోను.

వ్యక్తిగత జీవితానికి సంబంధించి నేను ఎక్కువగా రిస్క్ తీసుకోను. ఎందుకంటే ఏదైనా జరిగితే ప్రొఫెషనల్ లైఫ్ దెబ్బతింటుంది. అందుకే అఫైర్లకు దూరంగా ఉంటాను. ఖాళీ సమయంలో జిమ్‌కు వెళ్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటాను అని నేహా చెప్పింది.

English summary
Actor Neha Dhupia says the reason she is still single is because she is just not okay about taking any risk in her personal like, unlike her professional choices.She said I promise I’ll send a press release the day I start seeing someone. Till then, I’m single. I’m in a state of mourning, that’s how single I am,” laughs the actor, adding, “I only work. If you send me a work related message at 4am, I’ll do it. But if someone asks me out, I’ll say, ‘I have no time’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu