»   » వీడియో : ప్రియా వారియర్‌లా గురిపెట్టి పిచ్చెక్కించిందిగా..కాకపోతే రివర్స్‌లో!

వీడియో : ప్రియా వారియర్‌లా గురిపెట్టి పిచ్చెక్కించిందిగా..కాకపోతే రివర్స్‌లో!

Subscribe to Filmibeat Telugu

ప్రియా ప్రకాష్ వారియర్ ఏ ముహూర్తాన కనుగీటిందో కానీ ఆ మత్తు యువతకు ఇంకా వదల్లేదు. అభిమానుల్లోనే కాదు సెలెబ్రిటీలు సైతం ఆమెకు ఫిదా అయిపోయారు. ప్రియా వారియర్ ని అనుకరిస్తున్న సెలెబ్రిటీలు రోజురోజుకు ఎక్కువవుతున్నారు. తాజగా సింగర్ నేహా ప్రియా వారియర్ లా చేతి వేళ్ళని తుపాకిలా చేసి ముద్దు బుల్లెట్ ని పేల్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నాపై కూడా ప్రియా వారియర్ ప్రభావం పడింది. కాకపోతే నా తుపాకీ రివర్స్ అయిందని నేహా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. నేహా పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం నెటిజన్లలో చక్కర్లు కొడుతోంది. ప్రియా వారియర్ ని ఇదివరకే అల్లు అర్జున్ తన తనయుడు అయాన్ తో కలసి అనుకరించిన సంగతి తెలిసిందే. ప్రియా వారియర్ కేవలం ఒక్క వీడియోతో హాట్ సెలెబ్రిటిగా మారిపోయింది. బాలీవుడ్ లో సైతం ప్రియా వారియర్‌కు అదిరిపోయే ఆఫర్ లు వస్తున్నాయి.

English summary
Neha Kakkar's Priya Prakash Varrier-Inspired Video. Gun shot video goes viral
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu