»   » ముద్దల వీరుడితో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న నేహా శర్మ!

ముద్దల వీరుడితో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న నేహా శర్మ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ ముద్దులవీరుడు సైఫ్ అలీఖాన్ కాదండి బాబోయ్ లిప్ కిస్ స్సెషలిస్ట్ ఇమ్రాన్ హష్మీ సరసన 'క్రూక్" అనే చిత్రంలో చిరుత హీరోయిన్ నేహా శర్మ నటిస్తోంది. చిరు తనయుడు రామ్ చరణ్ తొలి చిత్రం 'చిరుత" సినిమా ద్వారా టాలివుడ్ కి పరిచయమై యావరేజ్ టాక్ తెచ్చుకొన్నది. అయితే వరున్ సందేశ్ తో 'కుర్రాడు"లో జత కట్టి తెలుగులో ప్లాప్ ని చవిచూసిన నేహాశర్మ, ఇమ్రాన్ హష్మీతో కలిసి నటిస్తోన్న 'క్రూక్" చిత్రం పై చాలా ఆశలే పెట్టుకొంది. మరి ఈ ముద్దుల వీరుడితో అదృష్టం కలిసొస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

ఈ చిత్రం కథాంశ పరంగా ఈ మధ్యన ఆస్ట్రేలియాలో జరుగుతోన్న జాత్యహంకార వరుస దాడుల నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు మొహిత్ సూరి 'క్రూక్" సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇమ్రాన్ హష్మీతో సినిమా అంటే, ఖచ్చితంగా లిప్ కిస్ సన్నివేశాలుంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, క్రూక్ లో మాత్రం అటువంటి లిప్ కిస్ సన్నివేశాలుండవనీ, అయితే సందర్భానుసారం కొన్ని హాట్ హాట్ సన్నివేశాలుంటాయనీ మొహిత్ సూరి అంటున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X