»   » ‘నేనే రాజు నేనే మంత్రి’ పబ్లిక్ టాక్: ప్లస్, మైనస్ పాయింట్స్ ఇవే...

‘నేనే రాజు నేనే మంత్రి’ పబ్లిక్ టాక్: ప్లస్, మైనస్ పాయింట్స్ ఇవే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'నేనే రాజు నేనే మంత్రి' మూవీ గ్రాండ్ గా రిలీజైంది. ఇప్పటికే ఇండియాతో పాటు విదేశాల్లో పలు చోట్ల ప్రీమియర్ షోలు వేశారు. రానా, కాజల్ హీరో హీరోయిన్లుగా కేథరిన్, నవదీప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య జరిగే లవ్ స్టోరీ కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందరి అంటున్నారు. ఆడియన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమా హిట్ కావడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.


స్టోరీ

స్టోరీ

జోగేంద్ర (రానా దగ్గుబాటి) విలేజ్‌లో వడ్డీవ్యాపారం చేసే యువకుడు. తన గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేస్తాడు. కొన్ని రాజకీయ పరిణామాల వల్ల జోగేంద్ర సీఎం తనికెళ్ల భరణి కేబినెట్‌లొ మంత్రి అవుతాడు. తనకు ఎదురైన కొన్ని సంఘటనలతో తానే సీఎం అవ్వాలని ప్రయత్నిస్తాడు. అయితే పార్టీలోని పరిస్థితులు అందుకు సహకరించక పోవడంతో తన పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్ క్యాండిడేట్‌గా చేస్తాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? అనేది తర్వాతి స్టోరీ...


రానా బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్

రానా బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్

నేనే రాజు నేనే మంత్రి మూవీలో రానా పెర్ఫార్మెన్స్ సినిమాకు మెయిన్ హైలెట్. కాజల్ అందంతో మెప్పించింది. రానా, కాజల్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. కేథరిన్, నవదీప్, అశుతోష్ రానా, శివాజీ రాజా, తనికెళ్ల భరణి, అజయ్, ప్రదీప్ రావత్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.


టెక్నికల్ అంశాల పరంగా సూపర్

టెక్నికల్ అంశాల పరంగా సూపర్

నేనే రాజు నేనే మంత్రి మూవీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బావున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమా పిక్చరైజేషన్, యాక్షన్ సీన్లు, పంచ్ డైలాగులు ఇలా అన్ని టెక్నికల్ విభాగాలు ప్రేక్షకులను మెప్పించాయి.


సినిమా ఫస్టాఫ్

సినిమా ఫస్టాఫ్

సినిమాపై ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన అభిప్రాయాల ప్రకారం ఫస్టాఫ్ చాలా బావుంది. అయితే సెకండాఫ్ లో ఓవర్ డోస్ సెంటిమెంట్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయని తెలుస్తోంది.
సినిమా ప్లస్ పాయింట్స్

సినిమా ప్లస్ పాయింట్స్

రానా పెర్ఫార్మెన్స్ సినిమాకు మెయిన్ హైలెట్
సినిమా ఫస్టాఫ్
రానా-కాజల్ సీన్లు
జోగేంద్ర రాజకీయ వ్యూహాలు
బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ


మైనస్ పాయింట్స్

మైనస్ పాయింట్స్

సెకండాఫ్ లో సీన్లు
పూర్ క్లైమాక్స్


English summary
Director Teja's Telugu movie Nene Raju Nene Mantri (NRNM) starring Rana Daggubati, Kajal Aggarwal and Catherine Tresa, has revceived positive review and ratings from the audience.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu