»   » నేను లోకల్: నాని కోరిక తీర్చిన దిల్ రాజు... (ఫోటోస్)

నేను లోకల్: నాని కోరిక తీర్చిన దిల్ రాజు... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాని, కీర్తి సురేష్‌ జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై త్రినాథరావు నక్కిన దర్వకత్వంలో దిల్‌రాజు నిర్మించనున్న నూతన చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహుర్తుపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్‌ రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేసి గౌరవ దర్శకత్వం వహించగా మరో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ''సినిమా చూపిస్త మావ సినిమా సమయంలో దర్శకుడు త్రినాథరావు, రైటర్‌ ప్రసన్నలతో పరిచయం ఏర్పడింది. అప్పుడు ఈ కథ గురించిన లైన్‌ చెప్పారు. నాకు ఎంతో బాగా నచ్చింది. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా, ఇడియట్‌ తరహాలో సాగే ఓ విభిన్నమైన ప్రేమకథాచిత్రం' అని తెలిపారు.

'నాని కూడా కథ వినగానే వెంటనే ఒప్పుకున్నాడు. హీరో నవీన్‌చంద్ర ఇందులో ఓ కీలకపాత్ర చేస్తున్నాడు. దేవిశ్రీ మ్యూజిక్‌ అందిస్తుండగా నేను శైలజ ఫేం కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ నెల 14 నుండి రెగ్యుల్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నామని' దిల్ రాజు అన్నారు.

డైరెక్టర్‌ త్రినాథరావు మాట్లాడుతూ ''ఈ సినిమాతో చాలా కోరికలు తీరాయి. దిల్‌రాజుగారి బ్యానర్‌లో వర్క్‌ చేయాలనుకోవడం, నానితో సినిమా చేయాలనుకోవడం, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతంలో సినిమా చేయాలనుకోవడం అన్నీ ఓనే సినిమాతో తీరుతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది' అన్నారు.

కాన్సెప్టు

కాన్సెప్టు

లోకల్‌ అబ్బాయి, నాన్‌లోకల్‌ అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా కాన్సెప్ట్‌. నాని మన పక్కింటి అబ్బాయిలాంటి పాత్రలోకనపడితే, కీర్తి సురేష్‌ మనింటి అమ్మాయిలా కనపడుతుంది. నవీన్‌ చాలా కీ రోల్‌ చేస్తున్నాడని దర్శకుడు తెలిపారు.

నా కోరిక

నా కోరిక

నాని మాట్లాడుతూ ''దిల్‌రాజుగారి బ్యానర్‌లో పనిచేయాలనేది నా కోరిక. ఇప్పటి అది తీరింది. మంచి ఎంటర్‌టైనింగ్‌ స్క్రిప్ట్‌. కథ వింటున్నప్పుడే ఎంజాయ్‌ చేశాను. నవీన్‌చంద్ర నాకు సమానంగా ఉండే పవర్‌ఫుల్‌ రోల్‌ చేస్తున్నాడు. కీర్తి సురేష్‌తో కలిసి వర్క్‌ చేయడం ఆనందంగా ఉంది'' అన్నారు.

నవీన్ చంద్ర

నవీన్ చంద్ర

హీరో నవీన్‌చంద్ర మాట్లాడుతూ ''సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దిల్‌రాజు, త్రినాథరావులకు థాంక్స్‌. నాని ఎంతో సపోర్ట్‌ చేస్తుంటాడు. చాలా ముఖ్యమైన పాత్ర చేస్తున్నాను'' అన్నారు.

కీర్తి సురేష్‌ మాట్లాడుతూ

కీర్తి సురేష్‌ మాట్లాడుతూ

''నేను శైలజ, నేను లోకల్‌ రెండింటి సౌండింగ్‌ ఒకేలా ఉంది. ప్రెస్టిజియస్‌ బ్యానర్‌లో నానితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది'' అన్నారు.

కీర్తి సురేష్

కీర్తి సురేష్

నేను శైలజ తర్వాత కీర్తి సురేష్ తెలుగు నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.

నాని, కీర్తి సురేష్

నాని, కీర్తి సురేష్

నాని, కీర్తి సురేష్ జోడీ తెరపై చూడటానికి చాలా సూపర్బ్ గా ఉంటుందని అంటున్నారంతా.

స్లిమ్ అయింది

స్లిమ్ అయింది

గత సినిమాతో పోలిస్తే కీర్తి సురేస్ కాస్త స్లిమ్ అయినట్లు స్పష్టం అవుతోంది.

ప్రారంభోత్సవం

ప్రారంభోత్సవం

నేను లోకల్ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమం

కీర్తి సురేష్

కీర్తి సురేష్

నేను లోకల్ మూవీలో కీర్తి సురేష్.

English summary
Dil Raju Producing Nenu local Movie Opening held at Production Office today (10th Aug) morning, Allu Aravind sounded the clap, Shyam Prasad Reddy switched on the camera for muhurath shot of the movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu