»   » కబాలి సాంగ్... మెగాస్టార్ చిరంజీవి వెర్షన్ అదిరింది

కబాలి సాంగ్... మెగాస్టార్ చిరంజీవి వెర్షన్ అదిరింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రజనీకాంత్ నటిస్తున్న 'కబాలి' చిత్రం రిలీజ్ ముందే సంచలనాలు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ ఇండియన్ సినిమా రంగాన్ని షేక్ చేసింది. అత్యధిక మంది చూసిన టీజర్ గా రికార్డుల కెక్కింది. తమిళంలో పాటు తెలుగు, హిందీలో విడుదల అవుతున్న ఈ చిత్రం బిజినెస్ పరంగా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ట్రేడ్ పండితులు.

Also Read: ఫిల్మ్ ఫేర్: చిరు లుక్ సూపర్బ్, సెలబ్రిటీల సందడి (ఫోటోస్)

జులైలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 5000 థియేటర్లలో వరల్డ్ వైడ్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రూ. 50 కోట్లకు కాస్త అటు ఇటు గా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి రూ. 200 కోట్ల బిజినెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Also Read: మెగా అనే పదం చాలా ప్రెస్టిజియస్, పెద్దనాన్న కష్టార్జితం (నిహారిక ఇంటర్వ్యూ)

రజనీకెరీక్లో ఎవర్ గ్రీన్ హిట్ సినిమా అంటే 'బాషా' అని ఎవరైనా టక్కున చెబుతారు. ఆ సినిమా తర్వాత రజనీకాంత్ సినిమాలేవీ అలాంటి నేపథ్యంలో రాలేదు. చాలా కాలం తర్వాత రజనీ బాషా రేంజిలో 'కబాలి'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

కబాలి చిత్రానికి సంబంధించి 'నిరుప్పు దా కబాలి' అనే సాంగ్ టీజర్ ఇటీవల రిలీజైంది. కొందరు అభిమానులు దీన్ని మెగాస్టార్ చిరంజీవి వెర్షన్లో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు. చూడ్డానికి ఇది ఎంతో బావుంది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఇలా ఉంటే బావుంటుంది అని అభిమానులు కోరుతున్నారు.

English summary
Check out the Neruppu Da Kabali song mega Star Chiranjeevi Version.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu