twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    15 మిలియన్ల సబ్‌స్క్రైబర్స్.. నెట్‌ఫ్లిక్స్ జోరు మాములుగా లేదే!

    |

    నెట్‌ఫ్లిక్స్ పదం వినని వారు, దాని గురించి తెలియని వారెవరూ ఉండరు. ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఊపందుకుంటున్న వేళ.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్ వంటి యాప్స్ రాజ్యమేలుతున్నాయి. కొత్త సినిమాలను థియేటర్లలోనే చూడాలని ఒకప్పుడు అంతా ఎదురుచూసేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఎంత పెద్ద సినిమా అయినా సరే 60 రోజుల్లోపే వారి ముందుకు తెస్తున్నాయి ఈ తరహా యాప్స్.

    ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రాజ్యమేలుతోంది నెట్‌ఫ్లిక్స్. వెబ్ సిరీస్, అంతర్జాతీయ నటీనటుల చిత్రాలు ఎక్కువగా అందులో సందడి చేస్తుంటాయి. తరువాతి స్థానంలో అమెజాన్ ప్రైమ్ ఉంటుంది. మన దేశంలో ఈ రెండింటి వాడకం ఎక్కువగానే ఉంది. ప్రస్తుత కాలంలో అయితే అందరూ వీటిపైనా ఆధారపడుతున్నారు. కరోనా వైరస్ విజృంభించడంతో అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు.

    Netflix Subscription For 2020 First Quarter Is 15 Millions

    గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ అమలువుతుండటంతో.. ప్రజలంతా ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో టీవీలకు, ఫోన్‌లకు అతుక్కుపోతోన్నారు. దేశంలో టీవీ వాడకం దాదాపు 22 శాతం పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నెట్‌ఫ్లిక్స్ సైతం ఓ ప్రకటన చేసింది. తమకు 2020 ప్రథమార్ధంలో మొత్తంగా 15.8 మిలియన్ల సబ్‌స్క్రైబర్స్ వచ్చారని దీంతో 5.77 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరిందని ప్రకటించింది. కోవిడ్19 విపత్కర పరిస్థితుల్లోనూ తమ మెరుగైన సేవలందిస్తున్నామని తెలిపింది.

    English summary
    Netflix Subscription For 2020 First Quarter Is 15 Millions. The streaming giant added nearly 16 million new subscribers in the first three months of the year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X