For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నయనతారను కిస్ చేసే ఫొటో పెట్టమన్న నెటిజన్: విఘ్నేష్ శివన్ ఊహించని ఆన్సర్

  |

  సినీ రంగంలో సెలెబ్రిటీల మధ్య ప్రేమాయణాలు అనేవి సర్వ సాధారణం. ఇవి ఎక్కువగా బాలీవుడ్‌లోనే కనిపిస్తుంటాయి.. అయితే, ఈ మధ్య కాలంలో దక్షిణాదిలోనూ లవ్ ట్రాకులు నడుస్తున్నాయి. ఇలా చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోన్న వారిలో లేడీ సూపర్ స్టార్ నయనతార.. యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ జంట ఒకటి. ఎన్నో రోజులుగా కహానీ నడుపుతోన్న వీళ్లిద్దరూ పెళ్లి మాత్రం ఆలస్యం చేస్తూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్ నయనతారను కిస్ చేసే ఫొటో పెట్టమని విఘ్నేష్‌ను కోరాడు. ఆ సంగతులు మీకోసం!

  రెండు బ్రేకప్‌ల తర్వాత విఘ్నేష్‌తో లవ్

  రెండు బ్రేకప్‌ల తర్వాత విఘ్నేష్‌తో లవ్

  కెరీర్ పరంగా ఫుల్ సక్సెస్ అయిన నయనతార.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం బ్రేకప్‌ల రూపంలో కొన్ని ఎదురుదెబ్బలను ఎదుర్కొంది. ఇప్పటికే ఇద్దరు ప్రముఖులతో విడిపోయిన ఆమె.. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ అనే దర్శకుడితో ప్రేమాయణం సాగిస్తోంది. వీళ్లిద్దరూ కలిసి ‘నానుమ్ రౌడీ దాన్' అనే మూవీ చేశారు. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి బంధాన్ని సాగిస్తున్నారు.

  సీక్రెట్‌గా ప్రేమాయణం... అప్పటి నుంచే

  సీక్రెట్‌గా ప్రేమాయణం... అప్పటి నుంచే

  ముందుగా నయనతార.. విఘ్నేష్ శివన్ చాలా కాలం పాటు స్నేహితులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే వీళ్ల మధ్య ప్రేమ చిగురించింది. అప్పుడు ఈ విషయాన్ని సదరు దర్శకుడు ఆమెకు చెబుతూ ప్రపోజ్ చేశాడు. దీనికి నయన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం నడిపారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి పబ్లిక్‌గానే తిరిగేస్తున్నారు.

   పెళ్లి మాత్రం ఆలస్యం... పుకార్లు షికార్లు

  పెళ్లి మాత్రం ఆలస్యం... పుకార్లు షికార్లు

  నయనతార.. విఘ్నేష్ శివన్ ప్రేమాయణం గురించి వార్తలు వచ్చి దాదాపు మూడు నాలుగేళ్లు అవుతోంది. అప్పటి నుంచే వీళ్లిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ, అది మాత్రం ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో అసలు వీళ్లు పెళ్లి చేసుకుంటున్నారా? లేక విడిపోతారా? అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

   ఆ ఫొటోతో క్లారిటీ... పెళ్లిపై స్పష్టత లేదు

  ఆ ఫొటోతో క్లారిటీ... పెళ్లిపై స్పష్టత లేదు

  ఆలస్యం అవుతున్న కొద్దీ.. నయనతార.. విఘ్నేష్ శివన్ పెళ్లిపై అందరిలో సందేహాలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మధ్య ఈ యంగ్ డైరెక్టర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేశాడు. అందులో నయన్ చేతికి ఎంగేజ్‌మెంట్ రింగ్ కూడా ఉంది. దీనికితోడు అదే అర్థం వచ్చేలా విఘ్నేష్ క్యాప్షన్ కూడా పెట్టి క్లారిటీ ఇచ్చాడు. దీంతో డౌట్లకు బ్రేక్ పడిపోయింది.

  ఫ్యాన్స్‌తో చిట్ చాట్.. నయనతార గురించే

  ఫ్యాన్స్‌తో చిట్ చాట్.. నయనతార గురించే

  సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. ఈ క్రమంలోనే నిత్యం ఫ్యాన్స్‌తో ఎన్నో విషయాలను పంచుకుంటుంటాడు. ఇందులో భాగంగానే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ను నిర్వహించాడు. ఈ సందర్భంగా చాలా మంది నెటిజన్లు నయనతారతో రిలేషన్ గురించి అతడిని ప్రశ్నలు అడిగారు.

  నయన్‌ను ముద్దాడే ఫొటో కోరిన నెటిజన్

  నయన్‌ను ముద్దాడే ఫొటో కోరిన నెటిజన్

  ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌‌లో విఘ్నేష్ శివన్ తమ పెళ్లి ఆలస్యం అవడానికి అసలు కారణం చెప్పిన విషయం తెలిసిందే. అదే సమయంలో నయనతార గురించి పర్సనల్ విషయాలను కూడా అడిగారు కొందరు. వీటికి ఏమాత్రం అసహనం వ్యక్తం చేయకుండా సమాధానాలు చెప్పాడతను. ఈ క్రమంలోనే ఓ ఔత్సాహిక నెటిజన్ ‘నయనతారను కిస్ చేస్తున్న ఫొటోను పెట్టండి' అని అడిగాడు.

  ఊహించని ఆన్సర్ ఇచ్చిన విఘ్నేష్ శివన్

  ఊహించని ఆన్సర్ ఇచ్చిన విఘ్నేష్ శివన్

  కిస్ చేస్తున్నప్పటి ఫొటోను షేర్ చేయమన్న నెటిజన్‌కు విఘ్నేష్ శివన్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. దీనిపై స్పందిస్తూ.. ‘కిస్ చేస్తున్నప్పుడు నేను బిజీగా ఉంటాను. కాబట్టి ఎవరైనా ఉంటే మా ఇద్దరి ముద్దును ఫొటో తీయొచ్చు' అంటూ ఊహించని సమాధానం చెప్పాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండడం విశేషం.

  English summary
  Nayanthara, Vignesh Shivan, Nayanthara Vignesh Kiss, Vignesh Shivan Comments on Kiss,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X