Don't Miss!
- News
చంద్రబాబుకు పొంచివున్న ప్రమాదం: ఎలాగో వివరించిన మంత్రి రోజా..!!
- Sports
IND vs NZ: చెలరేగిన స్పిన్నర్లు.. చేతులెత్తేసిన న్యూజిలాండ్ బ్యాటర్లు! భారత్ టార్గెట్ ఏక్‌సౌ!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Chiranjeevi చిరంజీవిని 'అంకుల్' అన్న సినీ విశ్లేషకుడు.. 'నీ బాధేంటి తమ్ముడు' అంటూ షాకింగ్ గా!
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ స్వింగ్‌లో కనిపిస్తున్నారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. గతంలో కంటే ఇప్పుడు వేగంగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోన్న ఆయన.. ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ స్టార్ హీరో వాల్తేరు వీరయ్యగా సందడి చేయనున్నారు. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రముఖ సినీ విశ్లేషకులలో ఒకరైన ఉమర్ సంధు తాజాగా చిరంజీవిపైన ఘాటు కామెంట్స్ చేశాడు. అప్పుడప్పడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఉమైర్ సంధు తాజాగా చిరును టార్గెట్ చేసి నెటిజన్ల ట్రోలింగ్ గురయ్యాడు.

అభిమానులకు పండుగ వాతావరణం..
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. యంగ్ ఏజ్ హీరోలకు సరిసమానంగా పోటీ ఇస్తూ జోష్ చూపిస్తున్నారు. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో కమ్ బ్యాక్ హిట్ కొట్టిన చిరంజీవి త్వరలో వాల్తేరు వీరయ్యగా రాబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్ టీజర్ మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ టీజర్ మాస్ ఎలిమెంట్స్‌తో అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

కమర్షియల్ ఎలిమెంట్స్ తో..
ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. సుమారు 22 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి నటించిన ఈ వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు రానుంది. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచానలు మాములుగా లేవు. ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ చిత్రం పక్కా మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది.

చిరంజీవిని టార్గెట్ చేస్తూ..
ఇదిలా ఉంటే టాప్ సినీ విశ్లేషకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు ఉమైర్ సంధు. సినిమాలకు రివ్యూలు మాత్రమేకాకుండా అప్పుడప్పుడు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రోలింగ్ బారిన పడుతుంటాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవిపై ఘాటు కామెంట్స్ చేసి మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ అంకుల్ అని సంబోధించాడు.

నీ బాధ ఏంటీ తమ్ముడు..
"చిరంజీవి అంకుల్.. ఇంకా యంగ్ గా కనిపంచాలనే ప్రయత్నాన్ని మానుకోండి. ఇప్పుడు మీ వయసు 70 ఏళ్లు అని గుర్తు ఉంచుకోండి" అని ట్వీట్ చేశాడు ఉమైర్ సంధు. ఈ ట్వీట్ వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఉమైర్ సంధుపై విరుచుకుపడుతున్నారు. 'నీ సమస్య ఏంటీ తమ్ముడు', 'అతని లుక్స్ తో నీ భార్యను కూడా ఆకట్టుకోగలడు', 'ఒకరిని అగౌరవపరిచనంత మాత్రానా, ద్వేశంతో కామెంట్స్ చేసినంత మాత్రానా నువ్ గొప్ప వ్యక్తివి అనిపించుకోలేవని గుర్తుంచుకో' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

కొత్త సీసాలో పాత సారా..
అయితే చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఉమైర్ సంధు ట్వీట్స్ చేయడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా ఇలానే విమర్శలు చేసి ట్రోలింగ్ బారిన పడ్డాడు సినీ క్రిటిక్ ఉమైర్ సంధు. గాడ్ ఫాదర్ సినిమా విడుదల సందర్భంగా రివ్యూలో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. "చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఓ యావరేజ్ మూవీ. కొత్త సీసాలో పాత సారా అనేలా ఉంది.
|
ఇకనైనా రెస్ట్ తీసుకోండి..
చిరంజీవి గారు దయచేసి మీరు రెస్ట్ తీసుకోండి. ఇకనైనా మంచి కంటెంట్ ఉన్న స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. ప్రజల మనిషి అని చెప్పుకుంటూ.. మాస్ హీరో క్యారెక్టర్స్ నుంచి వీలైనంత తర్వగా బయటపడండి. మీ టాలెంట్ ను వేస్ట్ చేసుకోకండి. మీరు మెగాస్టార్ అనే విషయం ఈ సినిమాలో అస్సలు కనిపించడం లేదు" అని ట్వీట్ చేశాడు ఉమైర్ సంధు.