For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Waltair Veerayya: హెలీకాప్టర్ సీన్‌పై ట్రోల్స్.. ఎన్టీఆర్ డైరెక్టర్ ఎంట్రీ.. చిరంజీవిపై ఘోరంగా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన నటన, డ్యాన్స్, ఫైట్స్, గ్రేస్‌తో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తూ నెంబర్ వన్ హీరోగా వెలుగొందుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. రీఎంట్రీలో మరింత జోష్‌తో కనిపిస్తోన్న ఆయన.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగాస్టార్ 'వాల్తేరు వీరయ్య' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాస్ మహారాజా రవితేజ కూడా నటించిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. అయితే, ఈ మూవీలోని ఓ సీన్‌పై మాత్రం ట్రోల్స్ వస్తున్నాయి. ఆ సంగతులేంటో మీరే చూడండి!

  వీరయ్యగా మారిన చిరంజీవి

  వీరయ్యగా మారిన చిరంజీవి


  మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో వచ్చిన మూవీనే 'వాల్తేరు వీరయ్య'. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మల్టీస్టారర్ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా హీరోయిన్లుగా నటించారు.

  ఘాటు ఫొటోతో టెంప్ట్ చేస్తోన్న దీప్తి సునైనా: కింది నుంచి చూపిస్తూ హాట్‌గా!

  గ్రాండ్ రిలీజ్.. సందడిగానే

  గ్రాండ్ రిలీజ్.. సందడిగానే

  క్రేజీ కాంబోలో తెరకెక్కిన 'వాల్తేరు వీరయ్య' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1500 థియేటర్లకు పైగానే విడుదల చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా ప్రాంతాల్లో ఈ సినిమా సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్‌తో థియేటర్లు అన్నీ కళకళలాడుతున్నాయి.

  చిరంజీవి మూవీకి టాక్ ఇలా

  చిరంజీవి మూవీకి టాక్ ఇలా

  మాస్ యాక్షన్ మూవీగా వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి సంబంధించి ఇప్పటికే ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని చోట్లా దీనికి మంచి స్పందన దక్కింది. దీంతో షోలన్నీ హౌస్‌ఫుల్ అయిపోయాయి. అయితే, టాక్ మాత్రం మిశ్రమంగా వస్తోంది. కొందరు ఇది బాగుందని అంటుంటే.. మరికొందరు ఏవరేజ్ అంటున్నారు.

  షర్ట్ విప్పేసి రెచ్చిపోయిన నిధి అగర్వాల్: ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా ఏంటీ!

  సినిమాలో ఆ సీన్ హైలైట్‌గా

  సినిమాలో ఆ సీన్ హైలైట్‌గా


  సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత తమ అభిమాన హీరో సినిమాను చూసిన వాళ్లంతా దానికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అవి బాగా ఎక్కువైపోయాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య'లోని కొన్ని క్లిప్స్ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఇందులోని హెలీకాప్టర్ సీన్ తెగ వైరల్ అవుతోంది.

  హెలికాప్టర్‌పైకి దూకిన చిరు

  హెలికాప్టర్‌పైకి దూకిన చిరు

  సక్సెస్‌ఫుల్ కాంబోలో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీలో మెగాస్టార్ చిరంజీవి కోసం పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ను డిజైన్ చేయించినట్లు చిత్ర యూనిట్ ముందుగానే చెప్పింది. ఇందులో భాగంగానే ఓ సన్నివేశంలో చిరంజీవిని కొందరు రౌడీలు వెంబడిస్తూ వస్తుంటారు. దీంతో ఆయన గాల్లో ఎగురుతోన్న హెలీకాప్టర్‌పైకి అమాంతం దూకేస్తారు. దీనిపై ఇప్పుడు ట్రోల్స్ వస్తున్నాయి.

  ఉల్లిపొర లాంటి డ్రెస్ మంచు లక్ష్మి షో: ఓ రేంజ్‌లో ఎద అందాలు ఆరబోత

  డిస్ట్రిబ్యూటర్లు అలాగే అని

  డిస్ట్రిబ్యూటర్లు అలాగే అని

  'వాల్తేరు వీరయ్య' మూవీలో మెగాస్టార్ చిరంజీవి ఏకంగా హెలీకాప్టర్ మీదకు దూకడం.. ఆ సమయంలో రౌడీలు అందరూ దాన్ని అందుకోలేక లోయలో పడిపోవడం.. చూపించడంతో చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాదు, సినిమా రిజల్ట్ చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లు చిరంజీవిని వెంబడిస్తూ వస్తున్నారని దారుణంగా పోస్ట్ చేస్తున్నారు.

  హెలీకాప్టర్‌లో ఆ డైరెక్టర్‌తో

  హెలీకాప్టర్‌లో ఆ డైరెక్టర్‌తో


  'వాల్తేరు వీరయ్య' మూవీలో హెలీకాప్టర్ సన్నివేశానికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన మరికొందరు నెటిజన్లు.. 'డైరెక్టర్ కొరటాల శివ.. డిస్ట్రిబ్యూటర్ల నుంచి బాస్‌ను కాపాడడం కోసం హెలీకాప్టర్ తీసుకుని వచ్చాడు' అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. అలాగే, చిరంజీవి ఇంట్రో సీన్‌లో వర్షంలో బీడీ ఎలా కాల్చుతున్నాడో చెప్పాలని డైరెక్టర్‌ను విమర్శిస్తున్నారు.

  English summary
  Chiranjeevi and Ravi Teja Did Waltair Veerayya Movie Under K. S. Ravindra Direction. Netizens Trolls On This Movie Helicopter Scene.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X