»   » ‘శ్రీమంతుడు’ టీ షర్ట్ కావాలంటే...

‘శ్రీమంతుడు’ టీ షర్ట్ కావాలంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీమంతుడు'. మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌‌పై తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 7న విడుదలై హిట్ టాక్‌తో వెళ్తోంది. ఈ సినిమా థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తూ నిన్న శుక్రవారంతో 50 రోజులను పూర్తి చేసుకుని వంద రోజుల దిశగా పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో మహేష్ బాబు వాడిన తరహా టీ షర్ట్ లను ,ఫ్యాషన్స్ ను అమ్మకానికి పెట్టారు. ఈ మేరకు వారు ఫేస్ బుక్ ద్వారా అబిమానులకు వివరాలు తెలియచేసారు.

New additions to Srimanthudu Fashion. Get this all new Mahesh Babu's look exclusively on www.livastar.com. Look cool,...


Posted by Srimanthudu on 19 October 2015

మహేష్‌ మాట్లాడుతూ ''దర్శకుడు కథ చెప్పగానే ఒక మంచి సినిమా చేయబోతున్నాననే నమ్మకం కలిగింది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ప్రేక్షకులు సినిమాని ఆదరించారు. మంచి సినిమా చేస్తే ప్రేక్షకుల ఆదరణ ఏ స్థాయిలో ఉంటుందో తెలిసింది. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయడానికి 'శ్రీమంతుడు' ఒక స్ఫూర్తినిచ్చింది'' అన్నారు.


''మంచి కథకి మహేష్‌బాబు లాంటి స్టార్ హీరో తోడైతే విజయం ఏ స్థాయిలో ఉంటుందో 'శ్రీమంతుడు' ఓ నిదర్శనంగా నిలిచింది''అన్నారు దర్శకుడు. మా సంస్థలో తెరకెక్కిన తొలి చిత్రమే ఇంతటి ఘన విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు నిర్మాతలు.


New additions to Srimanthudu Fashion.

ఈ చిత్రం 185 థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా నిర్మాతలు చిత్రం పోస్టర్స్ ని విడుదల చేసారు. ఆ పోస్టర్స్ ని క్రింద స్లైడ్ షోలో అందిస్తున్నాం చూడండి. ఈ రోజుల్లో ఓ చిత్రం ఇన్ని సెంటర్లలలో యాభై రోజులు పూర్తి చేసుకోవటం అంటే మాటలు కాదు.


ఈ సందర్బంగా ఈ చిత్రంలోని ..దిమ్మ తిరిగే సాంగ్ ని ఇక్కడ చూడండి...మరో ప్రక్క తమ ఊరుని దత్తత తీసుకొని బాగుపరచడమనే ఓ సామాజిక సందేశంతో ముడిపడి ఉన్న సినిమా తీసినందుకు ఇప్పటికే వెంకయ్య నాయుడు, కేటీఆర్ లాంటి రాజకీయ ప్రముఖులు మహేష్‌ను కొనియాడిన విషయం తెలిసిందే.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ... "మా బ్యానర్‌లో నిర్మించిన మొదటి సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ ఇది. మహేశ్, కొరటాల శివ గారికి స్పెష్ థాంక్స్. రాజకీయనాయకులు, స్పోర్ట్స్ పర్సన్స్, స్టార్స్ అందరూ ఈ చిత్రాన్ని చూశారు. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్‌కు చాలా చాలా థ్యాంక్స్'' అని అన్నారు.


జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

English summary
New additions to Srimanthudu Fashion. Get this all new Mahesh Babu's look exclusively on livastar. Look cool, casual and chic like Mahesh Babu. Available in multiple colors.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu