»   » రామ్ చరణ్ ఇంట్లో కొత్త ఫ్యామిలీ మెంబర్: ఉపాసన ట్వీట్ చేసింది

రామ్ చరణ్ ఇంట్లో కొత్త ఫ్యామిలీ మెంబర్: ఉపాసన ట్వీట్ చేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ గుర్రపు స్వారీలో జెమ్ అన్న విషయం తెలిసిందే. ఒక విధంగా చెర్రీ నటనపై విమర్శలు వచ్చాయేమో గానీ, హార్స్ రైడింగ్ పై మాత్రం ప్రశంసలే లభించాయి. ముఖ్యంగా 'మగధీర' సినిమాలో చేసిన గుర్రపు స్వారీ మెగా అభిమానులను విపరీతంగా అలరించిన విషయం తెలిసిందే. చరణ్ కీ ఉపాసనకి మేలు జాతి గుర్రాలంటే ఎంతో ఇష్టమనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2012 లో కూడా చరణ్ తన భార్య పుట్టిన రోజు కానుకగా మినియేచర్ జాతికి చెందిన ఓ గుర్రాన్ని ఐర్లాండ్ నుంచి తెప్పించాడు.

14 - 15 ఏళ్లపాటు జీవించే ఈ గుర్రం కేవలం 31 అంగుళాల వరకూ మాత్రమే పెరుగుతుంది. ముద్దుగా ... ముచ్చటగా కనిపించే ఈ గుర్రం ఉపాసనకి ఎంతగానో నచ్చిందనీ, ఆమె సంతోషం చూశాక ఆ గుర్రం కోసం తాను పడిన శ్రమ మరిచిపోయానని చరణ్ చెప్పాడు. ఏ డైమండ్ నేక్లేసో ... ఖరీదైన కారో తీసుకువచ్చినా ఆమె ఇంతగా సంబరపడేదికాదని చెప్పుకున్నాడు. ఆ గుర్రం కోసం ఏసీ షెల్టర్ కూడా ఏర్పాటు చేసారు.

అదొక్కటే కాక రామ్‌చరణ్ దగ్గర ఇంకా కొన్ని గుర్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటిల్లోనే ఒకటి పిల్లని పెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా ఉపాసనే చెప్పింది. ఓ బుల్లి గుర్రం పిల్ల బొమ్మను ఫోటో తీసి నెట్ లో పెట్టిన ఉపాసన.. తమ కొత్త ఫ్యామిలీ మెంబర్ గురించి చెప్పింది. 'మా కుటుంబంలోకి వచ్చిన కొత్త మెంబర్ చేరింది. ఎంతో అందంగా ఉన్న ఈ ఆరోగ్యమైన పిల్ల తెగ నచ్చేసింది. ఈ ఫోటో తీసినపుడు తన వయసు 3 గంటలు మాత్రమే' అని చెప్పింది ఉపాసన. ఈ బుల్లి గుర్రం పక్కనే ఉన్న రామ్ చరణ్.. దాన్ని దగ్గరికి తీస్కొని తెగ ముద్దులాడేస్తున్నాడు.

English summary
"Excited with the new addition to the family - a beautiful healthy filly - she's about 3 hrs old in the pic" Posted Upaasana Kamineni.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu