»   » ‘శ్రీమంతుడు’ కలెక్షన్స్ స్ట్రాంగ్: కొత్త సీన్లు కలుపుతున్నారోచ్

‘శ్రీమంతుడు’ కలెక్షన్స్ స్ట్రాంగ్: కొత్త సీన్లు కలుపుతున్నారోచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు 'శ్రీమంతుడు' చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్రానికి కొన్ని అదనపు సీన్లను జోడించనున్నారని తెలుస్తోంది. సినిమా క్లైమాక్స్ కు ముందు రాజేంద్రప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఊరు వదిలి పోతుంటే, మహేష్ బాబు అడ్డుకునే దృశ్యాలను ఈ వారం నుంచి చిత్రానికి కలపనున్నారని తెలుస్తోంది.

సినిమా ట్రైలర్లో ఈ సీన్లు ఉన్నాయి కానీ..నిడివి ఎక్కువవుతుందన్న కారణంగా సినిమా నుండి తొలగించారు. సినిమాకు రెస్పాన్స్ బావుండటంతో ఈసీన్లు మళ్లీ కలుపుతున్నారు. ఈ సీన్ చూసేందుకు ఫ్యాన్స్ మళ్లీ థియేటర్లకు వస్తారని భావిస్తున్నారు.


New Scenes Added In Srimanthudu

శ్రీమంతుడు కలెక్షన్ల విషయానికొస్తే... బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం ఈ చిత్రం కలెక్షన్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. వీక్ డేస్ లో కూడా మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఫస్ట్ వీకెండ్ రూ. 40 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం సోమవారం, మంగళవారం కూడా మంచి వసూళ్లు సాధించింది.


తొలివారం పూర్తయ్యే నాటికి ఈ చిత్రం రూ. 50 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. శ్రీమంతుడు సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు. జి మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సొంత ఊరుకు మంచి చేయాలనే కాన్సెప్టుతో విడుదలైన ఈ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.

English summary
New Scenes Added In Srimanthudu. Especially the ones where Rajendra Prasad, Shruti Haasan and their whole village walks out of the village after Sasi grabs lands from them. But that's not seen on silver screen. Don't worry, you can catch it now when you go to theatres for second time.
Please Wait while comments are loading...