»   » మెగా ఫ్యామిలీలో కొత్త సెంటిమెంట్.. అల్లు అర్లున్‌ను చిరు ఫాలో..

మెగా ఫ్యామిలీలో కొత్త సెంటిమెంట్.. అల్లు అర్లున్‌ను చిరు ఫాలో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా షూటింగ్ ప్రారంభోత్సవాలు, ఆడియో ఆవిష్కరణలంటే భారీ హంగామా ఉండేది. మీడియా హడావిడి కనిపించేది. స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు క్లాప్ కొట్టడానికి తహతహలాడేవారు. ఆడియోను ఆవిష్కరించడానికి ప్రముఖులకు స్వాగతం పలికేవారు. ఉపన్యాసాలతో వేదికలు హోరెత్తివి. ఈ వ్యవహరంతో సినిమా ప్రారంభానికి ముందే నిర్మాతకు తడిసి మోపడయ్యేది. కానీ టాలీవుడ్‌లో ఈ మధ్య ట్రెండ్ మారినట్టు కనిపిస్తున్నది. కొత్త ట్రెండ్ క్రియేటర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పవచ్చు. ఇలా అల్లు అర్జున్ ప్రారంభించిన కొత్త సంప్రదాయాన్ని మెగా హీరోలు తుచ తప్పకుండా ప్రారంభిస్తున్నారు. అదేమిటంటే ..

ప్రీ రిలీజ్ ఫంక్షన్

ప్రీ రిలీజ్ ఫంక్షన్

ఎప్పటిలా కాకుండా సరైనోడు ఆడియో ఫంక్షన్‌కు అల్లు అర్జున్ దూరంగా ఉన్నాడు. దాని స్థానంలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాడు. ఆ ట్రెండ్‌ను మెగా హీరోలు అనుసరించారు కూడా. టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి కూడా అల్లుడి బాటలోనే నడిచాడు. ఖైదీ నంబర్ 150 కోసం ఆడియో ఫంక్షన్ కాకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించాడు.

నిరాడంబరంగా పూజా కార్యక్రమాలు

నిరాడంబరంగా పూజా కార్యక్రమాలు

తాజాగా మెగా ఫ్యామిలీలో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. ఖైదీ నంబర్ 150 ముహుర్తం షాట్‌ను చిరంజీవి తన సభ్యుల మధ్యలోనే నిర్వహించారు. మీడియా హంగామా లేకుండా సాదాసీదాగా నిరాడంబరంగా నిర్వహించారు. రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవాన్ని తన తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ చేతుల మీదుగా జరిపించారు.

నా పేరు సూర్య.. కూడా అదే పంథా

నా పేరు సూర్య.. కూడా అదే పంథా

ప్రస్తుతం అదే ట్రెండ్‌ను అల్లు అర్జున్ అనుసరిస్తున్నాడు. ఓ పక్క దువ్వాడ జగన్నాథం సినిమాను రిలీజ్ సిద్ధం చేస్తూనే మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. సినీ కథా రచయిత వక్కంత వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అనే చిత్రాన్ని ప్రారంభించారు. ఆ పూజా కార్యక్రమాన్ని బన్నీ తన తల్లిదండ్రుల చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు.

మెగా హీరోలు అనురిస్తారేమో

మెగా హీరోలు అనురిస్తారేమో

సినిమాలు కూడా సక్సెస్ అవుతుండటంతో మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా ఈ ట్రెండ్‌ను అనుసరిస్తారమో అనే మాట వినిపిస్తున్నది. కేవలం ఈ ట్రెండ్ మెగా ఫ్యామిలీకే పరిమితం కాకుండా మిగితా హీరోల సినిమాలకు కూడా అంటుకునే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల ఖర్చును కూడా కొంత అదుపులో పెట్టే అవకాశం ఉంటుందనే తాజా వాదన.

English summary
Allu Arjun organised a pre-release event for ‘Sarrainodu’ instead of an audio launch, all the Mega heroes followed that trend including Chiranjeevi. Now, looks like Mega heroes started following another sentiment. After Duvvada Jagannadham, Allu Arjun Immediately started his next film ‘Naa Peru Surya-Naa Illu India’. The pooja ceremony happened with his parents only. days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu