»   » ప్రముఖ నటి పడక గది మా సెంటిమెంట్... మరో ట్విస్ట్

ప్రముఖ నటి పడక గది మా సెంటిమెంట్... మరో ట్విస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటి పడక గది మా సెంటిమెంట్... మరో ట్విస్ట్

బాలీవుడ్ చిత్రాల్లో తల్లి పాత్రలో విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకొన్న విలక్షణ నటి, దివంగత నిరూప రాయ్ ఇంటి వివాదం కొత్త మలుపు తిరిగింది. తన మరణానంతరం ఆస్తులన్నీ తన భర్త కమల్ రాయ్‌కే చెందాలంటూ నిరూపమ 2010లో రాసిన డాక్యుమెంట్లన్నీ తన సోదరుడు కిరణ్ దాచిపెట్టారని నిరుపమ కుమారుడు యోగేశ్ ఆరోపిస్తున్నారు.

వివాదంలో నటి నివాసం

వివాదంలో నటి నివాసం


నటి నిరూ రాయ్‌కి ముంబైలోని నేసియన్ సీ రోడ్డులో ఆమెకు విశాలమైన విలాసవంతమైన ఫ్లాట్ ఉంది. దాని విలువ సుమారు రూ.100 కోట్లు. ఆ ఇళ్లు తమకే దక్కాలని ఆమె కొడుకులిద్దరూ కొట్లాటకు దిగారు. వివాదంగా మారిని ఆ ఫ్లాట్ కోసం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

 అది ఫ్లాట్ మా సెంటిమెంట్

అది ఫ్లాట్ మా సెంటిమెంట్

విలాసవంతమైన ఫ్లాట్ మా సెంటిమెంట్
నిరూప రాయ్ ఇంటిలోని బెడ్రూం కోసం ఆమె కుమారులిద్దరు కిరణ్ (45), యోగేశ్ (57) కోట్లాడుతున్నారు. ఆ పడక గదితో తమకు మరచిపోలేనటువంటి అనుబంధం ఉందని, అది మాకు సెంటిమెంట్ విషయం అని వారిద్దరూ పేర్కొంటున్నారు.

 తండ్రి పేరిట విల్లు

తండ్రి పేరిట విల్లు

ఆస్తులన్నీటికి సంబంధించి తన తండ్రి రెండో వీలునామా రాశారని, ఆస్తులన్నీ తనకే చెందాలని ఆ విల్లులో పేర్కొన్నారని యోగేశ్ తెలిపారు. కిరణ్‌కు తన తల్లిదండ్రుల ఆస్తులతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

యోగేశ్ ఫోర్జరీ చేశారు.

యోగేశ్ ఫోర్జరీ చేశారు.

ఇంటికి సంబంధించిన ఆస్తుల డాక్యుమెంట్లను యోగేశ్ ఫోర్జరీ చేశారు. ఆ విషయంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. ఆ విల్లు చట్టబద్దత లేదు. తమపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారు. సమయమే నిజాన్ని బయటపెడుతుంది అని కిరణ్ తరుఫు న్యాయవాది తెలిపారు.

ఇద్దరికి సమాన హక్కులు

ఇద్దరికి సమాన హక్కులు

ఫ్లాట్‌పై ఇద్దరికి సమాన హక్కులు
ఎంబసీ అపార్ట్‌మెంట్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఇంటి వైశాల్యం 3 వేల చదరపు అడుగులు. గార్డెన్ విస్తీర్ణం 8 వేల చదరపు అడుగులు. ప్రస్తుతం నిరుపమ రాయ్‌కి సంబంధించిన బెడ్రూంను కిరణ్ ఉపయోగించుకొంటున్నాడు. ఆ ఇంటిపై ఇద్దరు కొడుకులకు సమాన హక్కులు ఉన్నాయి.

 కబ్జా చేసి బెదిరిస్తున్నాడు. .

కబ్జా చేసి బెదిరిస్తున్నాడు. .

తల్లి బెడ్రూం విషయంలో వివాదం తలెత్తడంతో తన అన్న యోగేశ్‌పై కిరణ్ హైకోర్టులో కేసు నమోదు చేశాడు. ఆ ఇంటిని కబ్జా చేసేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేశారు.

చివరి రోజుల్లో నా తల్లిదండ్రులతో గడిపాను

చివరి రోజుల్లో నా తల్లిదండ్రులతో గడిపాను

నా తల్లిదండ్రుల చివరి రోజుల్లో వారితో నేను ఆ ఇంటిలో గడిపాను. నా తల్లిదండ్రులను యోగేశ్, అతడి భార్య చాలా వేధించారు. నా తండ్రి రాసిన విల్లులో ఆ ఫ్లాట్ మొత్తం నాకే చెందాలని రాశారు. కానీ నా అన్నను, అతడి ఫ్యామిలీని ఉండేందుకు అవకాశమిచ్చాను. వారు నా తల్లి బెడ్రూంలోకి వెళ్లకూడదనే షరతుతో అనుమతించాను అని కిరణ్ తెలిపాడు.

 ఆ ఇంటిని దుర్వినియోగం చేస్తున్నారు.

ఆ ఇంటిని దుర్వినియోగం చేస్తున్నారు.

అయితే కిరణ్ ఆరోపణలపై స్పందించడానికి యోగేశ్ అందుబాటులోకి రాలేదని ఓ మీడియా వెల్లడించింది. కాగా తన తమ్ముడు నా తల్లిదండ్రుల బెడ్రూంను దుర్వినియోగం చేస్తున్నారని, అందుకే తాళాలు ఇవ్వడం లేదని యోగేశ్ ఆరోపించడం గమనార్హం.

అమితాబ్, శశికపూర్‌కు తల్లిగా..

అమితాబ్, శశికపూర్‌కు తల్లిగా..

1970, 80 దశకాలలో బాలీవుడ్‌లో అద్భుతమైన పాత్రలను పోషించారు. 1970లో అమితాబ్ బచ్చన్, శశి కపూర్‌కు తల్లిగా నటించారు. దీవార్ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.

English summary
Nirupa Roy's sons Kiran, Yogesh are fighting for exclusive rights to one of the bedrooms. They citing that Its has "sentiments" attached to it...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu