»   » ఎవడు: చెర్రీ ఫ్యాన్స్ కోసం దిల్‌రాజు క్రిస్‌మస్ కానుక

ఎవడు: చెర్రీ ఫ్యాన్స్ కోసం దిల్‌రాజు క్రిస్‌మస్ కానుక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఎవడు'చిత్రం ఎట్టకేలకు సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి మహేష్ బాబు '1' సినిమాతో పోటీ పడుతున్నాడు చరణ్. అయితే ఓ వైపు '1' సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నా....'ఎవడు' గురించి ఎక్కడ ప్రచారమే లేదు.

ఈ నేపథ్యంలో అలర్టయిన దిల్ రాజు....క్రిస్‌మస్ సందర్భంగా చెర్రీ అభిమానుల కోసం 'ఎవడు' కొత్త టీజర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు నుండే సినిమా ప్రమోషన్లు ముమ్మరం చేయనున్నారని తెలుస్తోంది. 'ఎవడు' సినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఉన్నటికీ....ఎక్కువసార్లు సినిమా వాయిదాలు పడటం కారణంగా చాలా మంది అభిమానులు నిరాశ పడ్డారు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ గెస్ట్ పాత్రల్లో కనిపించనున్నారు. రామ్ చరణ్ కెరీర్లోనే ఇప్పటి వరకు లేని విధంగా పవర్ ఫుల్ యాక్షన్, అండ్ ఎంటర్టెన్మెంట్ తో ఈచిత్రాన్ని తెరకెక్కించారని, మగధీర చిత్రాన్ని సైతం ఈచిత్రం మించి పోతుందని యూనిట్ సభ్యులుతో పాటు, చిరంజీవి కూడా చెబుతుండటం గమనార్హం.

'ఎవడు' సినిమా విడుదల లేటవుతున్నా అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. కాగా ఈ చిత్రం తాజాగా 'ఇన్-ఫిల్మ్ బ్రాండింగ్'లో రూ. 1.5 కోట్లు ఆర్జించి సరికొత్త రికార్డు నెలకొప్పింది. 'ఇన్-ఫిల్మ్ బ్రాండింగ్' అంటే మొబైల్ నెట్వర్కింగ్ సంబంధించిన అంశం. గతంలో అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం దీని ద్వారా రూ. కోటి ఆర్జిస్తే...తాజాగా రామ్ చరణ్ 'ఎవడు' ఆ రికార్డును బద్దలు కొట్టింది. దీన్ని బట్టి సినిమాపై అంచనాలు ఏ రేంజిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

English summary
Mega Power Star Ram Charan’s ‘Yevadu’ is all set to hit the screens as a Sankranthi offering. A new teaser will be released for Christmas, to create some buzz around the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu