»   » ఫోటోలు: ప్రీతి జింతా భర్త ఇతడే, తాజ్ మహల్ వద్ద హల్ చల్!

ఫోటోలు: ప్రీతి జింతా భర్త ఇతడే, తాజ్ మహల్ వద్ద హల్ చల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ ముదురు బ్యూటీ ప్రీతి జింతా(వయసు 41) ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన జీని గుడెనఫ్ అనే వ్యక్తిని ప్రీతి జింతా ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం కూడా అమెరికాలోనే జరిగింది. పెళ్లికి ముందు ప్రీతి జింతా తన మ్యారేజ్ విషయంలో పెద్ద డ్రామానే సాగించిన సంగతి తెలిసిందే.

పెళ్లయిన దగ్గర నుండి ప్రతి జింతా తన భర్తతో కలిసి కనిపించలేదు. ఎట్టకేలకు జీని గుడెనఫ్ ఇండియా వచ్చాడు. ఇద్దరూ కలిసి ప్రేమకు చిహ్నమైన, ప్రపంచ ప్రఖ్యాత తాజ్ మహల్ సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్లో పోస్టు చేయడం ద్వారా ఇండియన్ అభిమానులకు అతన్ని పరిచయం చేసింది ప్రీతి.

ప్రీతి భర్త జీని గుడెనఫ్ మాత్రమే కాదు.... అత్త మామలు కూడా ఇండియా వచ్చారు. తొలిసారిగా వారు ఇక్కడికి రావడంతో వారికి ఎలాంటి లోటు లేకుండా మర్యాదలు చేస్తోంది. ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ప్రీతి తన పెళ్లి అనుభవాలను పంచుకున్నారు.

పెళ్లి తర్వాత జీవితం ఎంతో కొత్తగా అనిపిస్తోందని, జీని లాంటి వ్యక్తి తనకు జీవిత భాగస్వామిగా దొరకడం చాలా ఆనందంగా ఉంది అంటూ.... తన హ్యాపీ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది.

పెళ్లి తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇండియా వచ్చిన ప్రీతి.....ముంబైలో దిగడంతోనే తనకు ఎంతో ఇష్టమైన ఇక్కడి చాయ్ టేస్ట్ చూడటంతో పాటు దహి పూరి తిన్నట్లు ప్రీతి తెలిపింది.

స్లైడ్ షోలో ప్రీతి జింతా తన భర్తతో తాజ్ మహల్ సందర్శించిన ఫోటోస్...

భర్తతో కలిసి

భర్తతో కలిసి

భర్త జీని గుడెనఫ్ తో కలిసి తాజ్ మహల్ సందర్శించిన ప్రీతి జింతా.

అత్త మామలు

అత్త మామలు

భర్తతో పాటు అత్త మామలను కూడా ప్రీతి జింతా ఇండియాకు తీసుకొచ్చింది.

సూపర్

సూపర్

ప్లోరల్ ప్రింట్ డ్రెస్సులో ప్రీతి జింతా ఎంతో అందంగా కనిపించింది.

ఇరు ఫ్యామిలీలు

ఇరు ఫ్యామిలీలు

ప్రీతి, జీని ఇద్దరి ఫ్యామిలీస్ కలిసి తాజ్ మహల్ టూర్ వేసారు.

ప్రేమకు చిహ్నం

ప్రేమకు చిహ్నం

అంతకు ముందు ఎన్నోసార్లు తాజ్ మహల్ వద్దకు వచ్చాను. కానీ ఇపుడు జీనితో కలిసి రావడంతో కొత్త అనుభూతిని ఇచ్చిందని ప్రీతి చెప్పుకొచ్చింది.

ఎయిర్ పోర్టులో..

ఎయిర్ పోర్టులో..

భర్త జీనితో కలిసి ప్రతి ఇండియాలో ఎంటరైనప్పటి ఎయిర్ పోర్ట్ ఫోటోస్.

సెలబ్రేషన్స్

సెలబ్రేషన్స్

భర్త జీనితో కలిసి హోలి సెలబ్రేషన్స్ జరుపుకున్నప్పటి పోటో.

ఈ అందానికే పడిపోయాడు

ఈ అందానికే పడిపోయాడు

ఈ అందానికి జీని గుడెనఫ్ పడిపోయాడు.

భక్తి ఎక్కువే..

భక్తి ఎక్కువే..

ప్రీతి జింతాకు భక్తి భావం కూడా ఎక్కువే...

గ్రాండ్ పార్టీ

గ్రాండ్ పార్టీ

ఇండియాకు భర్త జీనిని తీసుకొచ్చిన ప్రీతి ఇక్కడి తన స్నేహితులకు, బంధువులకు, ఇండస్ట్రీలోని ప్రముఖులు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసింది.

English summary
The newly-weds of B-town, Preity Zinta & Gene Goodenough recently spotted together visiting one of the most beautiful places of the world, Taj Mahal (Agra).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu