న్యూస్ మేకర్ 2017: ఏం మాయ చేసిందో.. అక్కినేని ఇంటి కోడలిగా సమంత
News
oi-Rajababu
By Rajababu
|
దక్షిణాది సినీ పరిశ్రమలో అందం, అభినయంతో మెప్పించిన యువ హీరోయిన్లలో ఒకరు సమంత అక్కినేని. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏం మాయ చేశావే చిత్రంలో అక్కినేని నాగచైతన్యతో జతకట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, మనం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తొలి చిత్రంలో నాగ చైతన్యతో నటించిన సమంత కొద్ది సంవత్సరాలు అఫైర్ కొనసాగించింది. ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇప్పుడు అక్కినేని ఇంటి కోడలిగా మారింది.
టాలీవుడ్ స్టార్లకు కొత్త కష్టాలు..! | Filmibeat Telugu
అక్కినేని నాగచైతన్యతో సమంత వివాహం 2017 అక్టోబర్ 6, 7 తేదీలలో గోవాలో నిరాడంబరంగా జరిగింది. నవంబర్ 12వ తేదీన హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో మ్యారేజ్ రిసెప్షన్‌ను అక్కినేని నాగార్జున చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. తెలుగు చిత్ర పరిశ్రమతోపాటు, దక్షిణాది సినీ పరిశ్రమలో వీరి వివాహం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది.
నాగచైతన్యతో వివాహం తర్వాత నాగార్జునతో కలిసి రాజుగారి గది2 చిత్రంలో సమంత నటించింది. ప్రస్తుతం సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న మహానటి చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నది. అలాగే కన్నడంలో ఘనవిజయం సాధించిన యూటర్న్ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు. అంతేకాకుండా ఈ చిత్రం ద్వారా నిర్మాతగా మారే అవకాశం కూడా ఉందని వార్త వినిపిస్తున్నది. ఇలా అనేక సంచలన విషయాలతో సమంత 2017లో ఓ న్యూస్ మేకర్‌గా మారింది.
Samantha ruth Prabhu becomes as Samantha Akkineni after wedding with Naga Chaitanya. Before that she has been a dependable actor in South film Industry. Her latest movies is Raju Gari Gadhi and Mersal. Now Samantha is acting in popular actress Savithri's biopic Mahanati movie.
Story first published: Tuesday, December 19, 2017, 15:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more