»   » అందం, అభినయంలో నాగబాబు కూతురు సూపర్ (ఫోటోలు)

అందం, అభినయంలో నాగబాబు కూతురు సూపర్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు కుమార్తె నిహారిక ఈటీవీలో ప్రసారం అవుతున్న 'ఢీ'-7 కార్యక్రమానికి యాంకర్‌గా మారి తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన నిహారిక ఫోటోలు విడుదలయ్యాయి. ప్రేక్షకులు, అభిమానులు నిహారిక సూపర్ అంటూ కితాబిస్తున్నారు.

ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు మాత్రమే వచ్చారు. త్వరలో ఆ ఫ్యామిలీ నుంచి సినిమా హీరోయిన్ కూడా రాబోతుందనే సంకేతాలు నిహారిక జోరు చూస్తుంటే స్పష్టంగా కనిపిస్తోంది. మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి మాదిరి నిహారిక బుల్లితెర నుండి మొదలు పెట్టి వెండి తెర వైపు అడుగులు వేసే దిశగా తన ప్రయాణం కొనసాగిస్తోందని తెలుస్తోంది.

ఇప్పటికే నిహారిక సోషల్ నెట్కవర్కింగులో యాక్టివ్‌గా ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా నిహారిక తన అందమైన ఫోటోలను విడుదల చేస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. రాజమౌళి తనయుడు కార్తికేయ రూపొందిస్తున్న షార్ట్ ఫిల్మ్‌‌లో నాగ బాబు కూతురు నిహారిక, నాగార్జున తనయుడు అఖిల్ కలిసి నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ఆ మధ్య షార్ట్ ఫిల్మ్‌కు సంబంధించిన షూటింగు కూడా జరిగింది.

ఢీ 7 కార్యక్రమానికి సంబంధించిన నిహారిక ఫోటోలు, ఇతర ఫోటోలు స్లైడ్ షోలో...

ఢీ 7 జూనియర్స్ కార్యక్రమంలో నిహారిక

ఢీ 7 జూనియర్స్ కార్యక్రమంలో నిహారిక

ఢి 7 జూనియర్ కార్యక్రమానికి ఓ పాటకు డాన్స్ చేస్తూ నిహారిక ఇంట్రడక్షన్ జరిగింది.

స్మైల్ అదిరింది

స్మైల్ అదిరింది

నిహారిక స్మైల్ ఎంతో బాగుందని, ఆమె నవ్వితే ముత్యాలు రాలినట్లుంటుందని పలువురు ప్రశంసిస్తున్నారు.

డ్రస్సింగ్ రూంలో ఉత్సాహంగా....

డ్రస్సింగ్ రూంలో ఉత్సాహంగా....

ఢీ 7 కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు నిహారిక డ్రెస్సింగ్ రూంలో ఇలా ఉత్సాహంగా కనిపించింది.

మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్

మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్

ఇప్పటి వరకు మెగా స్టార్ కుటుంబం నుంచి దాదాపు అరడజనుకు ‌పైగా హీరోలు వెండి తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆ కుటుంబం నుంచి ఒక్క హీరోయిన్ కూడా వెండి తెరకు పరిచయం కాలేదు. మెగాస్టార్‌కు ఇద్దరు కూతుర్లు ఉన్నప్పటికీ వాళ్లు మొదటి నుంచీ పూర్తిగా సినీ రంగానికి దూరంగానే ఉంటూ వచ్చారు. నిహారిక తెరంగ్రేటం చేస్తే ఆమె మెగా కుటుంబం నుంచి వచ్చే తొలి హీరోయిన్ అవుతుంది.

అభ్యంతరం లేదంటున్న నాగబాబు

అభ్యంతరం లేదంటున్న నాగబాబు

నిహారిక నటన వైపు ఆసక్తి చూపుతోంది. ఆమె ఆలోచనకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఉంది. గతంలో నాగబాబు మీడియాతో మాట్లాడుతూ.....నిహారికకు ఇంట్రెస్టు ఉంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసారు.

తెలివైన అమ్మాయి

తెలివైన అమ్మాయి

నిహారిక చాలా తెలివైన అమ్మాయి అని, ఏ విషయాన్నయినా చాలా కూల్‌గా సాల్వ్ చేస్తుందని......నన్ను ఏ విషయంలోనైనా ఇట్టే కన్విన్స్ చేస్తుందని నాగబాబు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

సెంటరాఫ్ అట్రాక్షన్

సెంటరాఫ్ అట్రాక్షన్

నిహారిక ఈ మధ్య ఏ కార్యక్రమానికి హాజరైనా సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారుతోంది. ఆమె సినిమాల్లోకి వస్తుందనే ప్రచారం కూడా ఇందుకు ఓ కారణం కావొచ్చు. మెగా ఫ్యామిలీ హీరోయిన్ అంటే ఆ మాత్రం ఉండటం కామనే...

నిహారికపై నమ్మకం!

నిహారికపై నమ్మకం!

మెగా బ్రదర్ నాగబాబుకు తన కొడుకు వరుణ్ తేజ్ కన్నా...కూతురు నిహారికపైనే నమ్మకం ఎక్కువ అట. ఎందుకంటే వరుణ్ తేజ్ కన్నా, నిహారికనే చాలా ఇంటలిజెంట్ అంటున్నారు నాగ బాబు.

చాలా చురుకు!

చాలా చురుకు!

నిహారిక చిన్నప్పటి నుంచి చాలా చురుకైన అమ్మాయి. అందరితో త్వరగా కలిసిపోయే తత్వం, ఏ పనయినా పర్ ఫెక్టుగా చేసే గుణం. వెరసి మెగా ఫ్యామిలీ అమ్మాయిల్లో నిహారికే బెస్ట్ అనే టాక్ మెగా ఫ్యామిలీ సన్నిహితుల నుంచి వినిపిస్తోంది.

పవన్ బాబాయ్, చరణ్ అన్నయ్యతో..

పవన్ బాబాయ్, చరణ్ అన్నయ్యతో..

పెదనాన్న చిరంజీవి అంటే నిహారిక భక్తితో పాటు కాస్త భయం కూడా ఉందట. అయితే బాబాయ్ పవన్ కళ్యాణ్ మరియు అన్నయ్య చరణ్‌తో ఆమె చాలా క్లోజ్ గా ఉంటుందని ఈ ఫోటో చూస్తే స్పష్టం అవుతోంది.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో నిహారిక చాలా సన్నిహితంగా ఉంటుంది. ఇక్కడున్న ఫోటో పరిశీలిస్తే నిహారిక, అల్లు అర్జున్ మధ్య ఉన్న స్నేహ పూర్వక బంధాన్ని అర్థం చేసుకోవచ్చు.

వరుణ్ తేజతో..

వరుణ్ తేజతో..

ఇంట్లో వరుణ్ తేజ కంటే నిహారిక చాలా అల్లరి చేస్తుంట. ఈ విషయాన్ని నాగబాబు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కొన్ని విషయాలు నాన్న ముందు ధైర్యంగా డీల్ చేయడానికి వరుణ్ భయపడతాడట. అలాంటపుడు నిహారిక హెల్ప్ తీసుకుని నాన్నను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడట వరుణ్.

నాగబాబు ముద్దుల కూతురు

నాగబాబు ముద్దుల కూతురు

నాగబాబుకు నిహారిక ముద్దుల కూతురుగా చెప్పుకోవచ్చు. నిహారికను నాగబాబు ఎంతో గారాబంగా పెంచారు. అన్ని విషయాల్లోనూ ఆమెకు పూర్తి స్వేచ్చనిచ్చారు. తన కూతురును చూసి నేను ఎంతో గర్వ పడతాను అని నాగబాబు చెప్పుకుంటున్నారంటే నిహారిక గురించి అర్థం చేసుకోవచ్చు.

అఖిల్‌తో

అఖిల్‌తో

అఖిల్ తో కలిసి నిహారిక ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించినట్లు వార్తలు వినిపించాయి

English summary
Naga Babu daughter Niharika Konidela turned TV show anchor recently and here are her photos from the event Dhee juniors show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu