»   » మెగా ఫ్యాన్స్‌తో నిహారిక మీటింగ్, ఏం చెప్పింది? (ఫోటోస్)

మెగా ఫ్యాన్స్‌తో నిహారిక మీటింగ్, ఏం చెప్పింది? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా కాంపౌండ్ నుంచి యాంక‌ర్ గా, వెబ్ సిరీస్ న‌టిగా మ‌న‌కు సుప‌రిచితురాలు అయిన నిహారిక ఇప్పుడు రామ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి నిర్మాత‌గా తెర‌కెక్కుతున్న ఒక మ‌న‌సు చిత్రంతో మెగా వార‌సురాలిగా మ‌న‌కు ప‌రిచ‌యం అవుతున్న సంగ‌తి తెలిసిందే.

అయితే మొద‌టిసారిగా మెగా ఫ్యామిలీ నుంచి వ‌స్తున్న న‌టిగా ఫ్యాన్స్ కు ఉన్న అపోహ‌లు, అనుమానాలు తొలగించ‌డానికి ఈరోజు చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ లో వివిధ జిల్లాల నుంచి 200 కు పైగా వ‌చ్చిన మ‌హిళా అభిమానుల‌తో నిహారిక ముచ్చ‌టించి, వాళ్ల ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులిచ్చింది.


ఆ ముచ్చ‌ట్లు ఆమె మాటల్లో..
'నా నుంచి వ‌చ్చే ఏ సినిమా వ‌ల్ల అయినా అభిమానుల‌కు గానీ, మా ఫ్యామిలీ కి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాను. మెగా వార‌సుల‌ను ఆశీర్వదించిన‌ట్టుగా నన్ను కూడా ఆద‌రిస్తార‌ని న‌మ్మ‌కంతో ఉన్నాను. ఒక మ‌న‌సు గురించి చెప్పాలంటే, ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌ను తాము చూసుకునేలా ఈ చిత్రం ఉంటుంది. నా మొద‌టి చిత్రంకు ఇలాంటి సబ్జెక్ట్ దొర‌క‌డం నిజంగా నా అదృష్టం' అన్నారు.


నిహారిక చెప్పిన మరిన్ని విశేషాలు, ఫోటోలు స్లైడ్ షోలో...


మార్పు వస్తుంది

మార్పు వస్తుంది

ఈ చిత్రం త‌ర్వాత ఖ‌చ్చితంగా ఆడ‌పిల్ల‌ల్లో ప్రేమ విష‌యంలో మార్పు వ‌స్తుంది అన్నారు నిహారిక.


ఫ్యామిలీ మూవీ

ఫ్యామిలీ మూవీ

ఫ్యామిలీ అంతా వెళ్లి చూసేలా ఒక మ‌న‌సు ఉంటుందని నిహారిక తెలిపారు.


వెన్నెల కిషోర్ గురించి..

వెన్నెల కిషోర్ గురించి..

సినిమాలో వెన్నెల కిషోర్ చేసిన కామెడీ కూడా ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుందని నిహారిక తెలిపారు.


నాగ శౌర్య గురించి..

నాగ శౌర్య గురించి..

నాగ‌శౌర్య‌తో చేయ‌డం చాలా హ్యాపీ ఉంది, మంచి ఫ్రెండ్లీ కోస్టార్ అని నిహారిక తెలిపారు.


పాటలు

పాటలు

ఇప్ప‌టికే పాట‌ల‌ను కొన్ని ల‌క్ష‌ల మంది విన్నారు. నిజంగా అద్భుత‌మైన పాట‌లు ఇచ్చాడు సునీల్ క‌శ్య‌ప్ అని తెలిపారు నిహారిక.


మెగా అభిమానులకు థాంక్స్

మెగా అభిమానులకు థాంక్స్

నాకోసం ఇంత దూరం వ‌చ్చిన మా మెగా అభిమానులంద‌రికీ చాలా కృత‌జ్ఞ‌త‌లు. ఈనెల 24న ఒక మ‌న‌సుతో థియేట‌ర్ల‌లో క‌లుద్దామని నిహారిక మీటింగ్ ముగించారు.


English summary
We all know from the mega compound who became popular as an Anchor and as an web series actor. She is non other than Neeharika konidela who is acting in a movie under the direction of Rama Raju in the production of Madura sreedhar named 'Oka Manasu'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu