Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
అవును నిజమే ఆగలేకపోతోన్నా.. ఆయనతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా.. మెగా డాటర్ కామెంట్స్
మెగా డాటర్‌గా బుల్లితెరపై, వెండితెరపై సందడి చేసింది నిహారిక కొణిదెల. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మొదటి చిట్ట చివరి హీరోయిన్‌గా నిహారిక పేరే శాశ్వతంగా నిలిచిపోతుందేమో. ఎందుకుంటే హీరోయిన్‌గా వెండితెరపై ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది నిహారిక. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క సక్సెస్ కూడా నిహారిక దరి చేరలేదు. అయితే ఏ మాత్రం నిరాశచెందని నిహారిక.. ఎలాగైనా ఒక్క హిట్ కొట్టాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. అయితే తాజాగా మరో ప్రయత్నం చేస్తున్నట్టు దానికి సంబంధించిన ఓ వార్తను అధికారికంగా ఓకే చేసింది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

నాగబాబు కామెంట్స్..
ఆ మధ్య నాగబాబు మాట్లాడుతూ నిహారిక కెరీర్‌పై కామెంట్స్ చేశాడు. ఇక పెళ్లెప్పుడు, సినిమాల సంగతేంటని అడిగితే ఆశ్చర్యకరమైన సమాధానమిచ్చాడు. త్వరలోనే పెళ్లి చేయాలని అనుకుంటున్నామని, సినిమాలకు ఇక స్వస్తి చెబుతుందన్నట్టుగా చెప్పుకొచ్చాడు.

నిహారిక సైతం అదే..
నిహారిక కూడా అలాంటి ధోరణిలోనే సమాధానం ఇచ్చింది. పెళ్లయ్యాక సినిమాల్లో నటిస్తారా? అని అడిగితే.. తానెమీ సమంతను కాదని కౌంటర్ వేసింది. దీన్ని బట్టి చూస్తే పెళ్లయ్యాక సినిమాకు గుడ్ బై చెబుతుందని తెలుస్తోంది.

ఆ మధ్య చెన్నైలో..
నిహారిక ఆ మధ్య చెన్నైకి ఎక్కువగా వెళ్లి వస్తుండేది. అక్కడి స్నేహితులతో ఎంజాయ్ చేసిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసేది. ఆ మధ్య ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడుతూ.. తదుపరి సినిమాల గురించి అడిగితే.. ఓ తమిళ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చింది.
ప్రభాస్‌తో పెళ్లి..
క్వారంటైన్‌లో సరదాగా గడుపుతున్న నిహారిక.. ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఈ క్రమంలోనే అనేక విషయాల గురించి మాట్లాడింది. ప్రభాస్‌తో పెళ్లి గురించి నెటిజన్స్ అడగ్గా.. అలాంటిదేమీ లేదని మరోసారి క్లారిటి ఇచ్చింది.

తాజాగా ప్రాజెక్ట్ గురించి..
నిహారిక కొణిదెల తన తదుపరి ప్రాజెక్ట్‌పై వచ్చిన వార్తల గురించి స్పందిస్తూ.. ‘అవును నిజమే.. నేను ఎంతో ఆత్రుతగా ఉన్నాను.. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుందా? అని ఆగలేకపోతోన్నా.. నా నెక్ట్స్ ఫిల్మ్ అశోక్ సెల్వన్ ( ఓ మై కడవలే ఫేమ్)తో, స్వాతిని దర్శకురాలిగా పరిచయం అవుతోంద'ని తెలిపింది.