»   » పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ఏంటో? పవన్ హీరోయిన్ ట్వీట్!

పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ఏంటో? పవన్ హీరోయిన్ ట్వీట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నటించిన ‘కొమురం పులి' చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన భామ నికీషా పటేల్... ఆ సినిమా పరాజయం కావడంతో హీరోయిన్ గా ఆమెకు కలిసి రాలేదు. ప్రస్తుతం సౌత్ లో తెలుగు, తమిళం, కన్నడలో చిన్న సినిమాల్లో నటిస్తూ కెరీర్‌ను నెట్టుకొస్తోంది.

యూకెలో పుట్టిపెరిగి నికీషా పటేల్... ప్రస్తుతం అక్కడే హాలిడే ఎంజాయ్ చేస్తోంది. తాజాగా తన ట్విట్టర్లో ‘మిడ్ హాలిడే ప్రెగ్నెన్సీ ఫన్' అంటూ ఓ ఫోటో పోస్టు చేసింది. అంటే గర్బం ధరించినట్లుగా ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నట్లుగా ఏదో ఆట ఆడారన్నమాట. పెళ్లి కాకుండానే ఈ ప్రెగ్నెసీ ఫన్ ఏంటో? అంటూ ఈ ఫోటో చూసిన వారు ఆశ్చర్య పోతున్నారు.

ఆమె కెరీర్‌కు సంబంధించిన విషయాల్లోకి వెళితే ‘కొమురం పులి' చిత్రం ప్లాపు కావడంతో నికిషా పటేల్‌కు అవకాశాలే కరువయ్యాయి. ఎదురు చూడగా..చూడగా ఆ తర్వాత రెండేళ్లకు కన్నడ చిత్రాల్లో అవకాశం దక్కించుకుంది. అయినా పెద్దగా పేరు మాత్రం రాలేదు. ఆ మధ్య తెలుగు చిత్రం కళ్యాణ్ రామ్ 'ఓం 3డి' చిత్రంలో అవకాశం దక్కినా మళ్లీ నిరాశే ఎదురైంది.

Nikesha Patel Pregnancy Fun

ప్రస్తుతం తమిళ, కన్న చిత్రాలపై దృష్టి సారించిన నికిషా పటేల్ తన గ్లామర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఆమె హాట్ అండ్ సెక్సీ ఒంపు సొంపులు ఐటం సాంగులకు పనికొచ్చే విధంగా ఉండటంతో కొందరు ఆమెను సంప్రదించారు. అయితే ఆమె మాత్రం ససేమిరా అంటోంది.

ఇటీవల నాగచైతన్య- సుధీర్ వర్మ సినిమా కోసం నిఖిషా పటేల్ ని సంప్రదించారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ ``నాకు చాలా ఆఫర్లు వస్తున్నాయి. కానీ నేనే వాటిని వద్దనుకుంటున్నాను. నాగచైతన్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేయమని అడిగారు. కానీ అలాంటి స్పెషల్ సాంగ్ లు చేయాలని లేదు. ఒకవేళ చేసినా అది ఒన్ అండ్ ఒన్లీ పవన్ కల్యాణ్ సినిమాల్లోనే చేస్తాను. ఇంకెవరి సినిమాల్లోనూ చేయను`` అని నిక్కచ్చిగా చెప్పింది.

English summary
Nikesha Patel herself uploaded a couple of funny photographs from her UK holiday and tweeted, "Mid-Holiday Pregnancy Fun". The images show the usually plump Nikesha look slightly pregnant but the gorgeous British actress is far from being pregnant.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu