»   » శంకరాభరణం... ఇది క్రైం, కామెడీ గురూ!

శంకరాభరణం... ఇది క్రైం, కామెడీ గురూ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్వామి రారా, కార్తికేయ, సూర్య వెర్సస్ సూర్య.. ఇలా వరుసగా వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ, ముందుకు దూసుకెళుతున్న నిఖిల్ ప్రస్తుతం మరో విభిన్నమైన చిత్రంలో నటిస్తున్నారు. 'శంకరాభరణం' పేరుతో కోన వెంకట్ సమర్పణలో ఎం.వీ.వీ. సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ నందనవనమ్ దర్శకుడు. 'గీతాంజలి' వంటి విజయం తర్వాత ఎంవీవీ సినిమా సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇది. పుణేకి 60 కిలోమీటర్ల దూరంలోని బోర్, నగరి, వాయ్ గ్రామాల్లో ఈ చిత్రం షూటింగ్ చేస్తున్నారు. ఈ నెల 15న మొదలైన ఈ షెడ్యూల్ 25 వరకూ సాగుతుంది.

చిత్రవిశేషాలను కోన వెంకట్ తెలియజేస్తూ - ''ఇది క్రైమ్ కామెడీ మూవీ. బీహార్ నేపథ్యంలో సాగుతుంది. కథానుసారం 'శంకరాభరణం' పెట్టాం. నాటి చిత్రానికీ, ఈ 'శంకరాభరణం'కీ సంబంధం లేదు. క్రైమ్ మూవీ కాబట్టి, చాలా రిస్కీ లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతాం. ఎంత రిస్కీ అంటే మనుషులు వెళ్లడానికి భయపడతారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది'' అని చెప్పారు. ఎం.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ - ''మా సంస్థ నుంచి వచ్చిన 'గీతాంజలి' ఘనవిజయం సాధించింది. మలి చిత్రం కూడా అలానే ఉండాలని తొమ్మిది నెలలు వెయిట్ చేసి, ఈ చిత్రకథను ఎంపిక చేశాం. కోన వెంకట్ అద్భుతమైన కథ ఇచ్చారు'' అన్నారు.


Nikhil's Sankarabharanam Movie details

రావు రమేశ్, సత్యం రాజేశ్, షకలక శంకర్, సుజయ్ మిశ్రా, పిటూబాష్ త్రిపాఠి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, ఎడిటింగ్: నవీన్ నూలి, రచనా సహకారం: వెంకటేశ్ కిలారు, భవాని ప్రసాద్, డ్యాన్స్ మాస్టర్స్: శేఖర్-శివ, ఫైట్ మాస్టర్: విజయ్, మేనేజర్స్: నాగు-రవి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహ నిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు: కోన వెంకట్.

English summary
The film stars Nikhil and Nanditha in lead roles. This film is being directed by Uday Nandanavanam and produced by Kona Venkat. Music composed by Praveen Lakkaraju.
Please Wait while comments are loading...