18 Pages Twitter Review: 18 పేజీస్ ఒక ఫీల్ గుడ్ మూవీ, కానీ అవి మాత్రం మైనస్ గా.. నిఖిల్ కు మరో హిట్?

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కలసి జంటగా నటించిన కార్తికేయ 2 మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలిసారిగా జత కట్టిన ఈ జోడికి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీకృష్ణుడి నేపథ్యంతో తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా దేశవ్యాప్తంగా హిట్ కావడంతో నిఖిల్ అండ్ అనుపమకు ఎక్కువ పాపులారిటీ లభించింది. ఇప్పుడు మరోసారి 18 పేజీస్ సినిమాతో జత కట్టారు నిఖిల్, అనుపమ పరమేశ్వరన్. డిసెంబర్ 23న ప్రేక్షకులు ముందుకు రానున్న ఈ సినిమాపై ఆడియెన్స్, నెటిజన్స్, సెలబ్రిటీస్ ఏమనుకుంటున్నారో ట్విటర్ రివ్యూలో చూద్దాం!

నిఖిల్ సిద్ధార్థ్, బ్యూటిఫుల్ భామ అనుపమ పరమేశ్వరన్ మరోసారి కలిసి జంటగా నటించిన చిత్రం 18 పేజీస్. కరెంట్, కుమార్ 21F వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 23న అంటే ఇవాళ శుక్రవారం విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడం, ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎమోషనల్ గా మాట్లాడటంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది.

Nikhil Siddharth Anupama Parameswaran 18 Pages Movie Twitter Review

చాలాకాలం గ్యాప్ తర్వాత పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై నెటిజన్స్ మాత్రమే కాకుండా పలువురు సెలబ్రిటీలు సైతం తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

"18 పేజీస్ సినిమా ఒక మంచి స్టోరి. ఒక మంచి సినిమా చూశామనే భావన కలుగుతుంది. కొన్ని క్రింజ్ సన్నివేశాలు మాత్రం సినిమా ఎక్స్ పీరియన్స్ ని పాడు చేస్తాయి" అని ఒక నెటిజన్ ట్విటర్ లో రాసుకొచ్చాడు.

"18 పేజీస్ సినిమా ఒక స్వీట్ అండ్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్. సుకుమార్ రైటింగ్స్ టీమ్ నుంచి మరొక చక్కని చిత్రం" అని మరో యూజర్ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. అలాగే పలువురు సినిమా ఇవాళ విడుదలవుతున్న సందర్భంగా సూపర్ హిట్ కావాలని ట్విటర్ వేదికగా ఆల్ ది బెస్ట్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X