For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthikeya 2 Twitter Review: నిఖిల్ మూవీకి అలాంటి టాక్.. బాహుబలి తర్వాత ఇదే.. క్లైమాక్స్ మాత్రం!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి బ్యాగ్రౌండ్ లేకుండానే ఎంట్రీ.. మినిమమ్ గ్యారెంటీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'హ్యాపీడేస్' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ కుర్రాడు.. తర్వాత సోలో హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. వీటిలో చాలా వరకు ఆశించినంతగా ఆడలేదు.

  కానీ, 2013లో వచ్చిన 'స్వామి రారా'తో నిఖిల్ కెరీర్‌ ఒక్కసారిగా ఊపందుకుంది. అప్పటి నుంచి వైవిధ్యమైన చిత్రాలతో అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు నిఖిల్ తన సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా 'కార్తికేయ 2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి!

  మరోసారి ‘కార్తికేయ'గా మారిన హీరో

  మరోసారి ‘కార్తికేయ'గా మారిన హీరో


  నిఖిల్ సిద్దార్థ్ హీరోగా చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రమే 'కార్తికేయ 2'. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను చేశారు. ఈ చిత్రం తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో విడుదలైంది.

  బద్రీ హీరోయిన్ బాత్రూం వీడియో వైరల్: వామ్మో ఇది చూశారంటే షాకే!

  అలాంటి స్టోరీ.. మరోసారి డివోషనల్

  అలాంటి స్టోరీ.. మరోసారి డివోషనల్


  నిఖిల్ సిద్దార్థ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమే 'కార్తికేయ 2'. ఎప్పటి నుంచో మిస్టరీగా మిగిలిపోయిన ద్వారకా నగరం గురించిన కథతో ఈ సినిమా రూపొందింది. 'కార్తికేయ' మాదిరిగానే దీన్ని కూడా డివోషనల్ టచ్‌తో రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి.

   బిజినెస్ తగ్గట్లుగా.. గ్రాండ్‌గా రిలీజ్

  బిజినెస్ తగ్గట్లుగా.. గ్రాండ్‌గా రిలీజ్


  నిఖిల్ 'కార్తికేయ 2' మూవీకి నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్ చేసుకుంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

  తెలుగు హీరోయిన్ అందాల ఆరబోత: ఆమె డ్రెస్, ఫోజులు చూస్తే!

  కార్తికేయ 2 సినిమాకు టాక్ ఏంటి?

  కార్తికేయ 2 సినిమాకు టాక్ ఏంటి?


  నిఖిల్ సిద్దార్థ్ నటించిన 'కార్తికేయ 2' మూవీ డివోషనల్‌గా సాగే మిస్టరీ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్ సహా ఇండియాలోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ట్విట్టర్ వేదికగా ఎక్కువ మంది నెటిజన్లు ఈ సినిమా బాగుందని ట్వీట్లను చేస్తున్నారు.

  ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ ఇంకోలా

  ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ ఇంకోలా


  'కార్తికేయ 2' మూవీ ఓవరాల్‌గా చూస్తే.. ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి డైరెక్టర్ చందూ మొండేటి ఎంతో సమయం తీసుకోలేదట. ఇంటర్వెల్ ట్విస్టుతో ఈ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచేస్తారట. ఇక, సెకెండాఫ్ మాత్రం అద్భుతమైన వీఎఫ్ఎక్స్ సీన్లతో నడుస్తుందట. అలాగే, క్లైమాక్స్ కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా డిజైన్ చేసినట్లు తెలిసింది.

  మాచర్ల నియోజకవర్గం ట్విట్టర్ రివ్యూ: నితిన్ రెండు షాక్‌లు.. అప్పుడే మూవీకి అలాంటి టాక్

  సినిమాలో ప్లస్‌... మైనస్‌లు ఇవే

  సినిమాలో ప్లస్‌... మైనస్‌లు ఇవే


  డివోషనల్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన 'కార్తికేయ 2'ను చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో నిఖిల్ నటన అదిరిపోయిందట. అలాగే, సినిమాటోగ్రఫి, బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయని అంటున్నారు. అయితే, కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు, సెకెండాఫ్ కాస్త ల్యాగ్ అయినట్లు అనిపించడం మైనస్‌గా మారాయని టాక్.

  మొత్తంగా మూవీ ఎలా ఉందంటే

  మొత్తంగా మూవీ ఎలా ఉందంటే


  ఇప్పటి వరకూ చూసిన ట్వీట్ల ప్రకారం.. నిఖిల్ సిద్దార్థ్ నటించిన 'కార్తికేయ 2' ఆద్యంతం ఆకట్టుకునేలా సాగిన థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. ఇందులో ద్వారాక నగరాన్వేషన అనే దాన్ని చక్కగా చూపించారట. మరీ ముఖ్యంగా ఆసక్తికరమైన సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లారని అంటున్నారు. మొత్తంగా ఇది అన్ని వర్గాల వాళ్లనూ ఆకట్టుకునే థ్రిల్లర్ మూవీ అని సమాచారం.

  శ్రీయ అందాల ఆరబోత: తల్లయ్యాక కూడా ఇంత హాట్‌గానా!

  బాహుబలి తర్వాత ఈ మూవీనే

  బాహుబలి తర్వాత ఈ మూవీనే


  నిఖిల్ సిద్దార్థ్ నటించిన 'కార్తికేయ 2' మూవీపై నెటిజన్లు తమదైన ట్వీట్లను చేస్తున్నారు. కొందరు టాలీవుడ్‌లో మరో హిట్ అని ఈ చిత్రం గురించి చెప్తున్నారు. ఇంకొందరైతే 'బాహుబలి' తర్వాత అదిరిపోయే సీక్వెల్ అని అంటున్నారు. ఇదిలా ఉండగా.. చాలా మంది ఈ సినిమాను నిఖిల్ నటించిన 'కార్తికేయ'తో పోల్చి మాత్రం చూడొద్దని సలహాలు ఇస్తుండడం గమనార్హం.

  Nikhil Siddharth Karthikeya 2 Movie Twitter Review
  English summary
  Nikhil Siddharth Now Did Karthikeya 2 Movie Under Chandoo Mondeti Direction. Now Lets See This Movie Twitter Review
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X