»   » హీరో కెరీర్ లోనే బెస్ట్ ప్రైస్ కు బిజినెస్...ఫుల్ హ్యాపీ

హీరో కెరీర్ లోనే బెస్ట్ ప్రైస్ కు బిజినెస్...ఫుల్ హ్యాపీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రెగ్యులర్,రొటీన్ కమర్షియల్ సినిమా ఫార్మెట్ లో పెద్ద హీరోల తరహాలో ప్రయత్నాలు చేసి బోల్తా పడ్డ నిఖిల్ ..రూట్ మార్చి సక్సెస్ లు ఇవ్వటం మొదలెట్టాడు. స్వామిరారా చిత్రంతో అతని జర్నీ మారిపోయింది. వరస హిట్స్ తో మినిమం గ్యారెంటీ హీరోగా దూసుకుపోతున్నాడు. దాంతో అతని చిత్రం అంటే బిజినెస్ బాగా జరుగుతోంది. తాజాగా శంకరాభరణం కు కూడా అదే సిట్యువేషన్. ఈ విషయం ధృవీకరిస్తూ ...చిత్రం ఓవర్ సీస్ బిజినెస్ విషయమై నిఖిల్ ట్వీట్ చేసారు.


స్కై హై ఫిల్మ్స్ వారు నా శంకరాభరణం చిత్రం ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. ఆడియన్స్ కు మేము మంచి ప్రొడక్ట్ ని ఇస్తామని ఆశిస్తున్నాము అన్నారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అలాగే ...


ఊహించని బిజినెస్ జరుగుతోందంటూ.... ఇలాశంకరాభరణం చిత్రం అన్ని ఏరియాల్లోనూ అద్బుతమైన రేట్లకు అమ్మకం జరిగింది. నా మీద నమ్మకం పెట్టిన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ధాంక్స్ అన్నారు.


'శంకరాభరణం'లో...'స్వామి రా రా', 'కార్తికేయ', 'సూర్య వర్సెస్‌ సూర్య'... ఇలా వరుస విజయాలు అందించిన ఉత్సాహంలో ఉన్నాడు నిఖిల్‌. ఇప్పుడు 'శంకరాభరణం' అనే మరో వినూత్న కథతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంతో ఉదయ్‌ నందనవనమ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎంవీవీ సత్యనారాయణ నిర్మాత.


 Nikil's Film sold out for Career-best Price

ఈ చిత్రంలో హీరోయిన్ గా నందితను ఎంచుకొన్నారు. ఓ ప్రత్యేక పాత్రలో అంజలి నటించనుంది. క్రైమ్‌ కామెడీ జోనర్‌లో సాగే కథ ఇది. సంపత్‌రాజ్‌, బ్రహ్మానందం, రఘుబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించిన కోన వెంకట్‌ సమర్పకుడిగానూ వ్యవహరిస్తున్నారు.


నిఖిల్ లుక్, బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో స్టైలిష్ గా ఉంటాయంటున్నారు. అమెరికాలో విలాసవంతమైన జీవితం అనుభవించే కుర్రాడు.. అనుకోని పరిస్థితుల్లో ఇండియా వచ్చి బీహార్లో చిక్కుకోవడం నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతోందట. దీంతో రీసెంట్ గా ఓ షెడ్యూల్ ను బీహార్ లోనూ పూర్తి చేశారు. మరి డిఫరెంట్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్న నిఖిల్ ఖాతాలో... ఈ శంకరాభరణం కూడా మరో విజయంగా నిలుస్తుందేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
English summary
Post three consecutive hits, Nikhil became the most sought after hero for Distributors. Even before the launch of Trailer or Audio, Theatrical Rights of 'Shankarabharanam' were acquired for fancy prices.
Please Wait while comments are loading...