»   » డిఫెరెంట్ కదా: ‘శంకరాభరణం’ సెట్లో నిఖిల్ (ఫొటో)

డిఫెరెంట్ కదా: ‘శంకరాభరణం’ సెట్లో నిఖిల్ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వరసగా విభిన్న తరహా చేస్తూ పోతున్న నిఖిల్ తాజాగా ‘శంకరాభరణం' టైటిల్ తో మరో క్రైమ్ కామెడీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కోన వెంకట్ స్క్రిప్ట్ సమకూర్చడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈమధ్యే మొదలైంది. షూటింగ్ మొదలైన రోజే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక షూటింగ్ గ్యాప్‌లో నిఖిల్ తీసుకుని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో మంచి ఆసక్తి కలిగిస్తోంది. మీరూ ఓ లుక్కేయండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన యువకుడిగా నిఖిల్ ఈ సినిమాలో కనిపించనున్నట్లు సమాచారం. , బీహార్ నేపథ్యంలో, అక్కడి వేషధారణలో ఉన్న వ్యక్తి పక్కన నిఖిల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు.

/news/nikil-still-his-latest-shankarabharanam-046264.html

చిత్రం విషయానికి వస్తే..

బీహార్ నేపథ్యంలో సాగే మరో సరికొత్త క్రైం కామెడీ సినిమా ఇది. ఈ సినిమాకు ‘శంకరాభరణం' అనే టైటిల్ పెట్టిన రోజునుంచే అంతటా మంచి ఆసక్తి రేకెత్తింది. తెలుగులో స్టార్ రైటర్‌గా వెలుగొందుతున్న కోన వెంకట్ ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరించడంతో సెట్స్‌పైకి వెళ్ళకముందే ఈ కాంబినేషన్‌పై అంచనాలు ఏర్పడ్డాయి.

గత కొద్దిరోజులుగా జరుగుతున్న స్క్రిప్ట్‌ పనులను పూర్తి చేసిన శంకరాభరణం టీమ్ ఈ రోజే షూటింగ్ మొదలుపెట్టింది. నార్త్ ఇండియాలోని సినిమా కథకు సరిపోయే పలు లొకేషన్లను ఈ మధ్యే ఎంపిక చేశారు. ఈ మధ్యనే షూటింగ్ మొదలైంది. ఆలాగే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇప్పటికే విడుదల చేశారు.

క్రైమ్ కామెడీ క‌థ‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన నందిత‌ను హీరోయిన్‌గా ఖరారు చేసినట్లు కోనవెంకట్ ప్రకటించారు. అలాగే ఈ సినిమాలో అతిధి పాత్రలో తెలుగమ్మాయి అంజలి నటిస్తోందని కోన తెలిపారు. అంజలికి ‘గీతాంజలి' చిత్రంతో కోన మంచి విజయాన్ని అందించారు. ఆ మేరకే అంజలి ‘శంకరాభరణం' చిత్రంలో గెస్ట్ రోల్ వేయడానికి సిద్థపడిందని సమాచారం.

English summary
It's a crime comedy titled Sankarabharanam set in the backdrop of Bihar. Nanditha plays female lead. Anjali will do a cameo. Sampath Raj, Brahmanandam, Rao Ramesh and Saptagiri play other important roles. Uday Nandanavanam will direct this movie. Kona Venkat is writing and presenting the movie. This film will be produced by MVV Satyanarayana who produced horror comedy Geetanjali in the past.
Please Wait while comments are loading...