twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్భయ దోషులకు ఉరి.. ఇదే అసలైన మార్గం.. సినీ తారల రియాక్షన్

    |

    కాస్త ఆలస్యమైనా ఎట్టకేలకు నిర్భయ దోషుల పాపం పండింది. నిర్భయ కేసులో నలుగురు దోషులైన ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలను తలారీ పవన్ జల్లాడ్ శుక్రవారం ఉదయం ఉరి తీశారు. ఈ అంశంపై పలువురు సినీ తారలు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు చూద్దామా..

    తిహార్ జైలులో ఉరి.. చివరకు తప్పలేదు

    తిహార్ జైలులో ఉరి.. చివరకు తప్పలేదు

    2012 నుండి ఇప్పటివరకూ నిర్భయ కేసులో నిందితులు ఉరి నుంచి తప్పించుకుంటూ వస్తున్నారు. ఏదో ఒక సాకుతూ వాయిదా పడుతూ వచ్చిన ఈ మూమెంట్ చివరకు నేటి ఉదయం కార్యరూపం దాల్చింది. నిర్భయ హత్యాచారం కేసులో దోషులైన నలుగురినీ పారామిలటరీ బలగాల భద్రత మధ్య ఢిల్లీలోని తిహార్ జైలులో ఉరి తీశారు.

    30 నిమిషాల పాటు ఉరికంబంపై వేలాడుతూ..

    30 నిమిషాల పాటు ఉరికంబంపై వేలాడుతూ..

    ఉరివేసిన తర్వాత 30 నిమిషాల పాటు అలా ఉరికంబాలపై ఉంచారు. అనంతరం నలుగురు దోషులను కిందకు దించి వారిని వైద్యులు పరీక్షించగా నలుగురూ మరణించారని తేలింది. దీంతో దేశమంతా ఊపిరిపీల్చుకుంది. ఈ అంశంపై పలువురు బాలీవుడ్, టాలీవుడ్ తారలు స్పందిస్తున్నారు.

    నిర్మాత పీవీపీ ట్వీట్..

    ''ధర్మ సంస్థాపనాయ సంభావామి యుగే యుగే". ఏడేళ్ల శని వదిలింది. చరిత్రలో నిర్భయ, దిశ మళ్ళీ పునరావృతం కాకూడదు. జైహింద్ అని నిర్మాత పీవీపీ ట్వీట్ చేశారు.

    సుస్మిత సేన్ రెస్పాన్స్

    ''నిర్భయ తల్లి ఆశాదేవి ఇది చూస్తున్నారు.. ఆమె పోరాటానికి న్యాయం జరిగింది'' అంటూ ట్వీట్ చేశారు సుస్మిత సేన్ ట్వీట్ పెట్టారు.

    నాగ శౌర్య ట్వీట్..

    నిర్భయ విషయంలో న్యాయం కాస్త ఆలస్యమైంది. కానీ చివరకు అమలైంది. బిగ్ సెల్యూట్ అండ్ రెస్పెక్ట్ టు ఆశా దేవి, సీమ సంరిది అంటూ ట్వీట్ చేశారు.

    Recommended Video

    Vishwaksen Hungama At Sandhya 70mm | Hit Movie Public Talk

    కీలకమైన నిర్ణయం.. బాలీవుడ్ హీరోయిన్

    వీళ్లను 2012లోనే ఉరితీసినట్లైయే మహిళలపై క్రైమ్ జరగకుండా ఉండేది. చట్ట విరుద్ధంగా వ్యవహరించేవారిని అదుపులో ఉంచుకోవడం కంటే.. నివారించమే మార్గం. మహిళలకు న్యాయం చేయడంలో కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి భారత ప్రభుత్వానికి ఇదే మంచి సమయం అని పేర్కొన్నారు బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా.

    English summary
    Four men convicted of gangraping Nirbhaya, a Delhi physiotherapy intern in December 2012 has been finally hanged at 5.30 am on March 20.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X