క్రేజీ ప్రాజెక్ట్‌ని వదిలేసుకున్న నితిన్.. కారణం అదే!
నితిన్ నటించిన తాజా చిత్రం ఛల్ మోహన్ రంగ. ఈ చిత్రం ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో నితిన్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా పాల్గొంటున్నాడు. ఛల్ మోహన్ రంగ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నితిన్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. తాను ఓ క్రేజీ ఆఫర్ ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో వివరించాడు. కమల్ హాసన్ నిర్మాణంలో విక్రమ్ ప్రధాన పాత్రలో ఓ చిత్రం రూపొందనుంది. ఇది మల్టీస్టారర్ చిత్రం. మరో హీరోగా నితిన్ ని అనుకున్నారు.

ఈ చిత్రం గురించి నితిన్ మాట్లాడాడు. కమల్ నిర్మాణంలో నటించే అవకాశం ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో వివరించాడు. తాను ఇప్పటికే శ్రీనివాస కళ్యాణం మరియు హరీశంకర్ చిత్రం కోసం కమిటై ఉన్నానని నితిన్ తెలిపాడు. ఆ చిత్రాలకు డేట్లు ఎక్కువగా కేటాయించాల్సి ఉంది. డేట్స్ కుదరకే కమల్, విక్రమ్ చిత్రాన్ని వదులుకున్నానని నితిన్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











