For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నితిన్‌కు కోలుకోలేని షాక్: రిలీజ్‌ రోజే లీకై కనిపించిన ‘చెక్’.. వాటిలో ఫుల్ మూవీ డౌన్‌లోడ్ లింక్!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోని మీడియం రేంజ్ హీరోలలో నితిన్ ఒకడు. 'జయం' అనే సినిమాతో పరిచయం అయిన అతడు.. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకున్నాడు. కానీ, ఆ తర్వాత మాత్రం వరుసగా పరాజయాలను చవి చూస్తూ ఇబ్బందులు పడ్డాడు. ఒకానొక దశలో అతడి కెరీర్ ముగుస్తుందని అంతా అనుకున్నారు. కానీ, 'ఇష్క్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి ఎన్నో హిట్లు అందుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా 'చెక్' అనే సినిమా చేశాడు. శుక్రవారమే విడుదలైన 24 గంటలకు తిరగకముందే ఈ మూవీ లీకైపోయింది. ఆ వివరాలు మీకోసం!

  తొలిసారి అలాంటి సినిమా చేస్తున్నాడు

  తొలిసారి అలాంటి సినిమా చేస్తున్నాడు

  ‘భీష్మ' వంటి భారీ హిట్ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తోన్న చిత్రం ‘చెక్'. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. కీరవాణి సంగీతం సమకూర్చారు. ఇందులో నితిన్ చెస్ ప్లేయర్‌గా నటించాడు. తొలిసారి కాన్సెప్ట్ మూవీలో చేస్తున్నాడతను.

  అంచనాలకు తగినట్లే ప్రీ బిజినెస్ కూడా

  అంచనాలకు తగినట్లే ప్రీ బిజినెస్ కూడా

  ‘చెక్' మూవీని ప్రారంభంలో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, ఎప్పుడైతే టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాయో అప్పటి నుంచి దీనిపై అంచనాలు పెరిగాయి. అప్పటి నుంచి ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కారణంగానే ‘చెక్' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.10 కోట్లు వరకూ జరిగింది. దీంతో ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది.

  భారీగా విడుదల.. తొలిరోజు టాక్ మాత్రం

  భారీగా విడుదల.. తొలిరోజు టాక్ మాత్రం

  నితిన్ నటించిన ‘చెక్' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1500లకు పైగా థియేటర్లలో విడుదల అయింది. మొదటి ఆట నుంచే దీన్ని చూసిన వారంతా రివ్యూలు ఇవ్వడం ప్రారంభించారు. ఫస్ట్ డే మొత్తంగా దీనికి మిక్స్‌డ్ టాక్ వచ్చిందనే చెప్పాలి. ఈ సినిమా విషయంలో నితిన్ ఫ్యాన్స్ మాత్రం హిట్ అని సంబర పడిపోతున్నారు.

  వాళ్లిద్దరిదే మొత్తం.. ఆయనలా.. ఇతడిలా

  వాళ్లిద్దరిదే మొత్తం.. ఆయనలా.. ఇతడిలా

  ‘చెక్' సినిమా చూసిన వారంతా డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి గురించే మాట్లాడుతున్నారు. ఇందులో ఆయన దర్శకత్వ ప్రతిభ స్పష్టంగా కనిపించింది. ఆయన స్టోరీ నేరేషన్, స్క్రీన్‌ప్లే అదరగొట్టేశాడని అంతా అంటున్నారు. ఇక, ఇందులో నటుడిగా నితిన్‌కు మంచి మార్కులు వేయొచ్చని విమర్శకులే కితాబిస్తున్నారు. సినిమా మొత్తాన్ని వన్ మ్యాన్ షోగా మార్చేశాడని ప్రశంసిస్తున్నారు.

  నితిన్‌కు కోలుకోలేని షాక్: రిలీజ్‌ రోజే లీక్

  నితిన్‌కు కోలుకోలేని షాక్: రిలీజ్‌ రోజే లీక్

  సంక్రాంతి తర్వాత వచ్చే సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ‘చెక్' మూవీ కూడా వాటి బాటలోనే పయనించేలా అనిపిస్తోంది. ఓపెనింగ్ డే కలెక్షన్లు కూడా భారీగానే వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలాంటి సమయంలో నితిన్ సినిమాకు కోలుకోలేని షాక్ తగిలింది. విడుదలై 24 గంటలు కూడా కాక ముందే ఈ సినిమా లీకైపోయింది.

  వాటిలో ఫుల్ మూవీ డౌన్‌లోడ్ లింక్!

  వాటిలో ఫుల్ మూవీ డౌన్‌లోడ్ లింక్!

  విడుదలైన కొద్ది గంటలకే ‘చెక్' మూవీ పైరసీ అయిపోయింది. ‘తమిళ్ రాకర్స్', ‘మూవీ రూల్జ్' సహా పలు వెబ్‌సైట్లలో ఈ సినిమా దర్శనమిచ్చింది. మరీ ముఖ్యంగా ‘టెలిగ్రామ్' యాప్‌లో ఈ సినిమాకు సంబంధించిన డౌన్‌లోడ్ లింక్‌ కూడా కనిపించింది. అయితే, కొద్ది సేపటికే దాన్ని డిలీజ్ చేసేశారు. కానీ, పైన పేర్కొన్న వెబ్‌సైట్స్‌లో మాత్రం ఈ సినిమా అలాగే ఉండిపోయింది.

  English summary
  Nithin Reddy, known professionally as Nithiin, is an Indian film actor and producer known for his works predominantly in Telugu cinema. Nithiin made his film debut in the year 2002 with Jayam, for which he received the Filmfare Award for Best Male Debut.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X