»   » పవన్ కళ్యాణ్ ఉండరు, ఉన్నట్లే ఉంటుంది.. షాకింగ్ న్యూస్ చెప్పిన నితిన్!

పవన్ కళ్యాణ్ ఉండరు, ఉన్నట్లే ఉంటుంది.. షాకింగ్ న్యూస్ చెప్పిన నితిన్!

Subscribe to Filmibeat Telugu

నితిన్ నటించిన తాజా చిత్రం ఛల్ మోహన్ రంగ. నితిన్ 25 చిత్రంగా రాబోతున్న ఛల్ మోహన్ రంగ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అ.. ఆ వంటి ఘనవిజయం తరువాత నితిన్ నటించిన లై చిత్రం నిరాశ పరిచింది. దీనితో తన 25 వ చిత్రం కోసం నితిన్ పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. ఛల్ మోహన్ రంగ చిత్రాన్ని నితిన్ అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకుడు కాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథ అందిస్తున్నారు.

ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా నితిన్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్నీ వెల్లడించాడు. ఈ చిత్రంలో నితిన్ పవన్ కళ్యాణ్ గెటప్ లో కనిపిస్తాడని వార్తలు వస్తుండడంతో నితిన్ దానిపై స్పందించాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఉండరు, కానీ ఉన్నట్లే ఉంటుంది అంటూ తెలిపి అభిమానులని సస్పెన్స్ లోకి నెట్టేశాడు. పలు చిత్రాల్లో నితిన్ పవన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే.

Nithiin will appear as Pawan Kalyan in Chal Mohan Ranga movie
English summary
Nithiin will appear as Pawan Kalyan in Chal Mohan Ranga movie. Nithiin reveals this in an interview
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X