»   »  పవన్, త్రివిక్రమ్ మ్యాజిక్.. ఛల్ మోహన్ రంగపై నితిన్ ఆశలు!

పవన్, త్రివిక్రమ్ మ్యాజిక్.. ఛల్ మోహన్ రంగపై నితిన్ ఆశలు!

Subscribe to Filmibeat Telugu

నితిన్ నటించిన ఛల్ మోహన్ రంగ చిత్రం పాజిటివ్ బజ్ తో గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తుండడంతో ఛల్ మోహన్ రంగ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. చిత్ర ఆడియో, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అదే విధంగా నితిన్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు. నితిన్ సరసన మేఘా ఆకాష్ రెండవసారి నటిస్తోంది.

నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. తన అభిమాన హీరో నిర్మిస్తున్న చితం కావడంతో నితిన్ చల్ మోహన్ రంగపై భారీ ఆశలు పెట్టుకుని ఉన్నాడు. పైగా ఈ చిత్రం నితిన్ కు 25 వ మూవీ. మాటల మాంత్రికుడి త్రివిక్రమ్ ప్రమేయం కూడా ఈ చిత్రంలో ఉంది. ఈ చిత్ర మూల కథని అందించింది త్రివిక్రమ్ కావడం విశేషం.

Nithin pin hopes on his 25th film Chal Mohan Ranga

ఛల్ మోహన్ రంగ చిత్రంపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఉంది. పవన్, త్రివిక్రమ్ క్రేజ్, కృష్ణ చైతన్య దర్శకత్వ దర్శకత్వ ప్రతిభతో ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని నితిన్ ఆశలు పెట్టుకుని ఉన్నాడు. ఏప్రిల్ 5 గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Nithin pin hopes on his 25th film Chal Mohan Ranga. Power Star Pawan Kalyan is one of the producer for this film
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X