»   »  నితిన్ బర్త్ డే స్పెషల్: ‘అ..ఆ’ ఫస్ట్‌లుక్ (ఫోటోస్)

నితిన్ బర్త్ డే స్పెషల్: ‘అ..ఆ’ ఫస్ట్‌లుక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్' రూపొందిస్తున్న చిత్రం 'అ ఆ'.

ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాలను కధానాయకుడు నితిన్ పుట్టినరోజు (30-3-16) సందర్భంగా విడుదలచేశారు.

ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) మాట్లాడుతూ ..'మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలం నుండి జాలువారిన ఒక మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ చిత్రాన్నిప్రేక్షకులు మే లో చూడబోతున్నారు అని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ సందర్భం గా తెలిపారు. మిక్కీజె. మేయర్ సంగీతం సంగీత ప్రియులను అలరిస్తుం దని అన్నారు. ఏప్రిల్ మొదటివారంలో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. మరోవైపు చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 6 న చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు.

త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంతనాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక గా ' అనుపమ పరమేశ్వరన్'(మలయాళ చిత్రం 'ప్రేమమ్' ఫేం) నటిస్తున్నారు. చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో .. నదియ,అనన్య,ఈస్వరీరావు,సన, గిరిబాబు, నరేష్,రావురమేష్ ,పోసాని, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి లు నటిస్తున్నారు.

నితిన్ బర్త్ డే

నితిన్ బర్త్ డే


నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

షూటింగ్

షూటింగ్


ఏప్రిల్ మొదటివారంలో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. మరోవైపు చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

మొదలైంది

మొదలైంది


మే6న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో నితిన్ పుట్టినరోజుతో ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

తెరవెనక

తెరవెనక


ఈ చిత్రానికి సంగీతం- మిక్కిజె. మేయర్,, కెమెరా- నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్- ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్ -కోటగిరి వెంకటేశ్వర రావు, సౌండ్ డిజైనర్- విష్ణు గోవింద్, శ్రీ శంకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- పి.డి.వి.ప్రసాద్ సమర్పణ శ్రీమతి మమత నిర్మాత- సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కధ-మాటలు -స్క్రీన్ ప్లే-దర్శకత్వం- త్రివిక్రమ్.

English summary
‘Wizard of Words’ Trivikam’s new romantic entertainer ‘A…Aa (Anasuya Ramalingam vs Anand vihari)’ featuring Nithin and Samantha in the lead roles has completed its talkie part and gearing up for release on may 6. The first look stills and posters were released on hero Nithin’s birthday today (March 30).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu