»   »  'రుద్రమదేవి' : నిత్యామీనన్ లుక్ ఇదే (ఫొటో)

'రుద్రమదేవి' : నిత్యామీనన్ లుక్ ఇదే (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'రుద్రమదేవి'. రానా ముఖ్య పాత్రధారి. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్యామీనన్ సైతం ఓ కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఆ పాత్ర పేరు ముమ్మడమ్మ. చరిత్ర ప్రకారం ఈమె పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంది. అయితే సినిమాలో మార్చారా లేక, ఉన్నదున్నట్లు తీస్తున్నారో చూడాలి.

చరిత్ర ప్రకారం... రుద్రమదేవి తండ్రి గణపతి దేవునికి పుత్ర సంతానం లేరు. ఆయనకు ఇద్దరు కుమార్తెలే. పెద్దామె రుద్రమదేవి, చిన్నామె గణపాంబ. తన వారసులే తన రాజ్యపాలన చేయాలనే ఆలోచనతో,మహామంత్రి శివదేవయ్య ఆదేశాలకనుగుణంగా, రుద్రమదేవిని చిన్ననాటి నుంచి పురుషుడులాగే పెంచుతారు. ఎవరికీ ఆ రహస్యం తెలియనివ్వరు. గణపాంబను ఓ సామంత రాజుకి ఇచ్చి పెళ్లి చేసి, రుద్రమదేవిని కాకతీయ సర్వసేనాని కుమార్తె ముమ్మడమ్మకు ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే తర్వాత కాలంలో రుద్రమదేవి స్త్రీ అని రివిల్ అయిన తర్వాత ముమ్మడమ్మను ఓ ఉత్తమ వీరుడుకి ఇచ్చి పెళ్లి చేస్తారు.

Nithya Menon as Mummidamma in the film Rudhramadevi


దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో తనకే సాధ్యమైన రీతిలో ఎవరూ వంక పెట్టలేని విధంగా రూపొందించాలని గుణ శేఖర్ కష్టపడుతున్నారు. ఈ మేరకు ఖర్చు కూడా భారీగా పెడుతున్నారు.

ఈ చిత్రంలో రాణీ రుద్రమగా....అనుష్క, చాళుక్య వీరభద్రునిగా.... రానా, గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్, ముమ్మడమ్మగా.... 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు.

అనుష్క, రానా, కృష్ణంరాజు, ప్రకాష్‌రాజ్‌, సుమన్‌, ఆదిత్య మీనన్‌, విక్రమ్‌జీత్‌, నిత్యామీనన్‌, కేథరిన్‌ ట్రెసా, హంసానందిని, బాబాసెహగల్‌ తదితర తారాగణంతో పాటు వేలాది మంది జూనియర్‌ ఆర్టిస్టులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఆర్ట్‌: తోట తరణి, ఫొటోగ్రఫీ: అజయ్‌ విన్సెంట్‌, ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌.

English summary
Gunasekhar roped in Nithya Menon to play a key role in the film and now, he has revealed that she'll be seen as a warrior princess named Mummidamma, who was a force to deem with during the supremacy of queen Rudhramadevi of Kakatiya dynasty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu