»   » ఎంత ముద్దొస్తుందో...! (నిత్య మీనన్ చిన్ననాటి వీడియో)

ఎంత ముద్దొస్తుందో...! (నిత్య మీనన్ చిన్ననాటి వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'అలా మొదలైంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులు పరిచయమైన మలయాళీ భామ నిత్యా మీనన్ తెలుగు ప్రక్షకుల ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. అమ్మడు హైట్ తక్కువైనా, అంత పెద్ద అందగత్తె కాక పోయినా వరుస అవకాశాలతో దూసుకెలుతోందంటే కారణం నటిగా ఆమె టాలెంటే.

నటన అనేది ఆమెకు చిన్నతనంలోనే అబ్బింది. పదేళ్ల వయసులోనే నిత్యా మీనన్ నటనా రంగంలోకి ప్రవేశించింది. 1998లో వచ్చిన The Monkey Who Knew Too Much అనే ఇండియన్ ఇంగ్లిష్ చిత్రంలో టబు చెల్లి పాత్రలో నటించింది. ఆ సినిమా తర్వాత మలయాళంలో అనువాదం అయింది.

ఆ సినిమాకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి యూట్యూబులో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే చిన్నతనంలోనే నిత్యా మీనన్ ఎంత ముద్దుగా నటించిందో అని మీరు ఆశ్చర్య పోతారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

నిత్యా మీనన్ గురించిన వివరాల్లోకి వెళితే... 1988లో అమ్మడు బెంగుళూరులో మలయాళీ ఫ్యామిలీలో జన్మించింది. జర్నలిజంలో గ్రాజ్యువేషన్ పూర్తి చేసిన నిత్యా మీనన్ జర్నలిస్టు అవ్వాలనుకుందట. అయితే కేవలం జర్నిస్టుగా తాను సాధించేది ఏమీ లేదని భావించిన ఆమె తర్వాత ఫిల్మ్ మేకర్ అవ్వాలని నిర్ణయించుకుంది. తాను నటిని అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు...కాకతాళీయంగా నటనవైపు వచ్చానని ఓ ఇంటర్వ్యూలో నిత్యా మీనన్ చెప్పుకొచ్చారు.

తెలుగులో 'అలా మొదలైంది' సినిమాకు నిత్యా మీనన్ మళయాలం, కన్నడలో దాదాపు 10 సినిమాల్లో నటించింది. అలా మొదలైంది తర్వాత ఆమెకు తెలుగు, తమిళంలో అవకాశాలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం తెలుగులో జనతాగ్యారేజ్, ఒక అమ్మాయి తప్ప సినిమాతో పాటు తమిళంలో రెండు, కన్నడలో ఒక సినిమా చేస్తోంది.

వీడియో...

నిత్యా మీనన్ చిన్నతనంలో నటించిన సినిమాకు సంబంధించిన వీడియో

పదేళ్ల వయసులోనే..

పదేళ్ల వయసులోనే..

పదేళ్ల వయసులోనే నిత్యా మీనన్ బాల నటిగా తెరంగ్రేటం చేసింది.

అప్పుడే గుర్తించారు

అప్పుడే గుర్తించారు

చిన్నతనంలో ఆమె టాలెంట్ చూసిన దర్శకుడు నువ్వు పెద్దయ్యాక పెద్ద హీరోయిన్ అవుతావు అన్నారట.

తనదైన టాలెంటుతో...

తనదైన టాలెంటుతో...

నిత్యా మీనన్ సౌత్ లో తనదైన టాలెంటుతో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దూసుకెలుతోంది.

English summary
Nithya Menon 's childhood video As child artist.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu