»   » జనతా గ్యారేజ్: ఆవిడెళ్ళింది ఈవిడొచ్చింది

జనతా గ్యారేజ్: ఆవిడెళ్ళింది ఈవిడొచ్చింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాన్నకు ప్రేమతో సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ప్రస్తుతం హైద్రాబాద్ లో యంగ్ టైగర్ పై ప్రధాన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటివరకూ జూనియర్ సమంతలపై సన్నివేశాలను షూట్ చేయగా. ప్రస్తుతం తన పార్ట్ లో సీన్లు ఏమీ లేకపోవటం తో కాస్త ఊపిరి పీల్చుకుంది సమంత.. ఇక తను నటించిన సినిమాలు వరుసగా రిలీజ్ లు ఉండడంతో. కొద్దిరోజులు బ్రేక్ తీసుకోవటం తప్పనిసరి అయ్యింది. అయితే ఈ గ్యాప్ లో నిత్యా వచ్చి ఎంటీఆర్ తో చేరిపోయింది.


Nithya Menon Starts Shooting For NTR's 'Janatha Garage'

జనతా గ్యారేజ్ లో నిత్యా మీనన్ రెండో హీరోయిన్ గా నటిస్తున్నా. ఇన్నాళ్ళూ సమంతాతో ఉండే సీన్లు తీయటం వళ్ళ నిత్యా ఇప్పుడే షూటింగ్ లో పాలుపంచుకుంది.


నిత్యా లాంటి ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ తో తొలిసారి నటించడంపై ఎన్టీఆర్ కూడా సంతోషంగా ఉన్నాడని అంటున్నారు. రీసెంట్ గా విడుదలైన సూర్య మూవీ 24లో కూడా నిత్యమీనన్ పాత్రకు బోలెడన్ని ప్రశంసలు వస్తున్నాయి.


Nithya Menon Starts Shooting For NTR's 'Janatha Garage'

తొలిసారిగా నిత్యతో నటిస్తున్న ఎన్టీఆర్.. ఆమె పెర్ఫామెన్స్ చూసి థ్రిల్ అయ్యాడని అంటున్నారు. మరికొన్ని సన్నివేశాల చిత్రీకరించిన తర్వాత.. మే 20న విడుదల చేయనున్న ఫస్ట్ లుక్ పై ఎన్టీఆర్ దృష్టి పెడతాడని తెలుస్తోంది.

English summary
Nithya Menon joined the sets started shooting with NTR
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu