»   »  నితిన్‌కు స్పెషల్ గిఫ్టు పంపిన పవన్ కళ్యాణ్!

నితిన్‌కు స్పెషల్ గిఫ్టు పంపిన పవన్ కళ్యాణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నితిన్ నటించిన 'అ..ఆ' చిత్రం జూన్ 2న విడుదలవుతున్న నేపథ్యంలో నితిన్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ పవన్ కళ్యాణ్ నుండి స్పెషల్ గిఫ్ట్ వచ్చింది. అదేంటో మీరు ఇప్పటికే ఊహించి ఉంటారు... మీరు ఊహించింది నిజమే. పవన్ కళ్యాణ్ తోట నుండి మామిడి పళ్లు గిఫ్టుగా వచ్చాయి. గిఫ్ట్ ప్యాక్ మీద. 'ఆల్ ది బెస్ట్ నితిన్ గారు (అ..ఆ), బెస్ట్ విషెస్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్' అంటూ రాసి ఉంది.

Also Read: 'అ...ఆ' పవన్ కళ్యాణ్ ను ఇలా వాడేసారు (వీడియో)

పవన్ కళ్యాణ్ నుండి గిఫ్ట్ అందగానే నితిన్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'థాంక్స్ సార్...దిస్ మీన్స్ ఎ లాట్' అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.

నితిన్ 'అ..ఆ' సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...
నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం అ..ఆ. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అనే సబ్ టైటిల్ తో రూపొందుతున్న ఈచిత్రం జూన్ 2న విడుదల చేస్తున్నారు.

Nitin received Mangoes from Pawan Kalyan

ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎటువంటి కట్స్ లేకుండా సినిమా క్లీన్ యు సర్టిఫికెట్ సొంతం చేసుకొంది. త్రివిక్రమ్ నుండి ఫ్యామిలీ ఎంటర్టెనర్ అంటే మంచి హాస్యం మేళవించిన కుటుంబ కథతో సాగుతుంది. 'అ ఆ' ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల నమ్మకాన్ని ఏమేరకు నిలబెడుతుందో చూడాలి.

త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంతనాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక గా ' అనుపమ పరమేశ్వరన్'(మలయాళ చిత్రం 'ప్రేమమ్' ఫేం) నటిస్తున్నారు. చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో .. నదియ,అనన్య,ఈస్వరీరావు,సన, గిరిబాబు, నరేష్,రావురమేష్ ,పోసాని, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి లు నటిస్తున్నారు.

English summary
Power Star Pawan Kalyan Sent Mangoes which were Cultivated in his Farm to Friends and Well Wishers. Actor Nitin felt Happy about Mangoes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu