»   » ‘అ..ఆ..’ షూటింగులో నితిన్-సమంత ఇలా (ఫోటో)

‘అ..ఆ..’ షూటింగులో నితిన్-సమంత ఇలా (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ నితిన్ హీరోగా సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. ‘అ...ఆ' (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల రామానాయుడు స్టూడియోలో జరిగింది.

గత నెలలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ చేస్తున్న తొలి సినిమా ఇది. ఈ సినిమాలో నితిన్ ఇద్దరు హీరోయిన్లతో డ్యూయోట్లు పాడుతున్నారు.

Nitin and Samantha at A..Aa shooting

సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సమంత నటిస్తుండగా.... మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. త్రివిక్రమ్ గత సినిమా ‘అత్తారింటికి దారేది' మూవీలో కీలక పాత్ర పోషించిన నటి నదియా కూడా ఇందులో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది.

ఈ సినిమాను ప్రముఖ తెలుగు నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రముఖ సౌత్ సినిమాటోగ్రాఫర్ నటరాజన్ సుబ్రహ్మణ్యం, యువత సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ కూడా ఈ సినిమాకు పని చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. సినిమా షూటింగ్ గ్యాపులో సమంత, నితిన్ రిలాక్స్ అవుతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

English summary
Nithin and Samantha are busy shooting for director Trivikram's A..Aa. The movie began its regular shoot last month and is currently progressing at brisk pace in Hyderabad.
Please Wait while comments are loading...