»   » నితిన్ నిజాలే చెప్పాడా? సమంత బోయ్ ఫ్రెండ్, అఖిల్ ఫ్లాఫ్, పవన్ సర్ఫైజ్ గురించి

నితిన్ నిజాలే చెప్పాడా? సమంత బోయ్ ఫ్రెండ్, అఖిల్ ఫ్లాఫ్, పవన్ సర్ఫైజ్ గురించి

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్:'అఖిల్' రిజల్ట్‌ని నేనెప్పటికీ మర్చిపోలేను. ఎన్నో అంచనాలతో, ఆశలతో తీసిన సినిమాకి నెగటివ్ టాక్ వచ్చేసరికి చాలా ఫీలయ్యా. నాలుగైదు రోజుల పాటు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. హిట్, ఫ్లాప్ అనేవి సర్వసాధారణం. కానీ, నా ఫ్రెండ్ అఖిల్ లాంచింగ్ సినిమా అలా కావడం నన్ను బాధించింది అంటూ చెప్పుకొచ్చారు హీరో నితిన్.

  అలాగే నితిన్ తాజా చిత్రం ..అ..ఆ ఒకసారి ఆగిపోయి మళ్లీ మొదలైందని మీకు తెలుసా..అంతేనా సమంత బోయ్ ఫ్రెండ్ ఎవరో అంత క్లోజ్ గా ఉండే నితిన్ కు తెలియదా..ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు నితిన్ నీట్ గా,సూటిగా సుత్తి లేకుండా సమాధానమిచ్చారు.


  లవ్ స్టోరీతో ప్రారంభమైన నితిన్ సినీ ప్రయాణం... మధ్యలో యాక్షన్ బాట పట్టినా మళ్లీ లవ్ స్టోరీల బాటే పట్టింది. మధ్యలో వరస ఫ్లాఫులు, ఏ హీరోకూ దాదాపు 14 ఫ్లాఫులు వచ్చినా తిరిగి నిలబడటం ఉండదేమో. కానీ 'ఇక నితిన్‌ పని అయిపోయింది' అనుకొన్న టైమ్ లోనే మళ్లీ లేచి నిలబడ్డాడు. అఖిల్ సినిమాని ప్రొడ్యూస్ చేసాడు కూడా.


  ఫ్లాఫ్ ల నుంచి పాఠాలు నేర్చుకుని, ఫైనల్ గా తాను ఎలాంటి సినిమాలు చేయాలో తెలుసుకుని సక్సెస్ లు ఇవ్వటం మొదలెట్టాడు. తనకు నప్పే కథల్నే ఎంచుకొంటూ మళ్లీ సక్సెస్ దారిలో ప్రయాణం చేస్తున్నాడు.


  'ఇష్క్‌', 'గుండె జారి గల్లంతయ్యిందే', 'హార్ట్‌ఎటాక్‌'... ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన నితిన్ ఇప్పుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో 'అఆ' చేశాడు. ఆ చిత్రం వచ్చే నెల 2న విడుదలవుతుంది. చిత్రం ప్రమోషన్ లో బాగంగా నితిన్‌ హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు. ఆ మాటల్లో భాగంగా సమంత బోయ్ ఫ్రెండ్ గురించి, అఖిల్ ఫ్లాఫ్ గురించి, పవన్ తన సెట్స్ వచ్చినప్పుడు విషయాలు ఎన్నో చెప్పుకొచ్చాడు.


  నితిన్ మాటలను...స్లైడ్ షో లో చదవండి


  బాధపెట్టింది

  బాధపెట్టింది

  నిర్మాతగా నేను చేసిన ‘అఖిల్‌' పరాజయాన్ని చవిచూడటం బాధపెట్టింది. సినిమా విడుదలయ్యాక నాలుగైదు నెలలపాటు రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు.  వెంటాడింది

  వెంటాడింది

  సినిమా పరాజయాన్ని చవిచూడటం, డబ్బులు పోవడం సహజమైన విషయాలే. కానీ అఖిల్‌ తొలి సినిమా ఇలా అయ్యిందేంటి అనే బాధ వెంటాడుతుంది. అందరూ కష్టపడ్డాం కానీ ఫలితం రాలేదు. కొన్ని సినిమాలు అంతే  అలా జరిగిపోయిందంతే

  అలా జరిగిపోయిందంతే

  మంచి సినిమా అనే మొదలుపెట్టాం. ఈ సినిమా కోసం వినాయక్‌గారు, అఖిల్, మా నాన్న, నేను చాలా కష్టపడ్డాం. అయితే కొన్ని సినిమాలు ప్రేక్షకులకు నచ్చవు. ఈ సినిమా ఫ్లాప్ కావాలని చేయలేదు. జరిగిపోయింది అంతే.  రాజమౌళి తర్వాత

  రాజమౌళి తర్వాత

  రాజమౌళిగారి తర్వాత నన్ను బాగా అర్థం చేసుకున్న దర్శకుడు త్రివిక్రమ్ గారు. నా పాజిటివ్స్, నెగటివ్స్ ఇలా అన్నిటినీ డిస్కస్ చేసి, నన్ను మరింత కొత్తగా చూపించారు.  ఫస్ట్ ఫోన్ ఆయనకే

  ఫస్ట్ ఫోన్ ఆయనకే

  వ్యక్తిగతంగా నాతో ఆయన అనుబంధం బలపడింది. త్రివిక్రమ్‌గారికి తెలీని విషయం లేదు. ఆయనో జ్ఞాని. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నాకేదైనా ప్రాబ్లమ్ వస్తే ఇక నుంచి నేను ఫస్ట్ ఫోన్ చేసేది ఆయనకే.  తప్పని తెలిసింది

  తప్పని తెలిసింది

  నటుడిగా 14 ఏళ్ల ప్రయాణం నాది. 2012 నుంచి కొత్త ప్రయాణం మొదలైంది. అంతకుముందు పరాజయాలతో చాలా నేర్చుకొన్నా. నా వయసుకు యాక్షన్‌ కథలు చేయడం తప్పని తెలిసింది.  చెప్పలేను

  చెప్పలేను

  ‘ఇష్క్‌', ‘గుండెజారి గల్లంతయ్యిందే' నుంచి కొత్త ప్రయాణం మొదలైంది. నేనిప్పుడు యాక్షన్‌ చేయొచ్చు కానీ అదీ ప్రేమ కోసమే చేయాలి, వూరిని కాపాడేందుకనో, మరొకటనో చేయకూడదు. భవిష్యత్తులో మాస్‌ సినిమాలు చేస్తానేమో చెప్పలేను  మొదట ఆగిపోయింది

  మొదట ఆగిపోయింది

  త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేయాలనేది నా కల. స్పెయిన్‌లో ‘హార్ట్‌ ఎటాక్‌' చిత్రీకరణ జరుగుతున్నప్పుడు త్రివిక్రమ్‌గారి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘అత్తారింటికి దారేది' తర్వాత ఆయన నాతో సినిమా చేయాలనుకొంటున్నారని తెలిసి సంతోషపడ్డా. అనుకోకుండా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.  ఇంకోసారి

  ఇంకోసారి

  ఆ తర్వాత ఇద్దరం బిజీ అయిపోయాం. ‘చిన్నదాన నీకోసం' తరవాత మరో సినిమా చేద్దామనుకుంటే అదీ ఆగిపోయింది. ఇంతలో త్రివిక్రమ్‌గారి నుంచి ‘అఆ' చేయమని పిలుపొచ్చింది.  తొలిసారి త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయడం

  తొలిసారి త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయడం

  ఈ సినిమా ద్వారా ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఇప్పటి వరకు నేను నటించిన 22 చిత్రాల్లోని నా నటనకు, ఈ చిత్రంలో నటనకు చాలా తేడా కనిపిస్తుంది. త్రివిక్రమ్ వల్ల చాలా నేర్చుకున్నాను.  ఫక్తు లవ్ స్టోరీ

  ఫక్తు లవ్ స్టోరీ

  ఫక్తు ప్రేమకథతో తెరకెక్కిన చిత్రం ‘అఆ'. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు, మానవీయ విలువల్ని తనదైన శైలిలో మేళవించారు త్రివిక్రమ్‌.  కొత్త కథకాదు కానీ

  కొత్త కథకాదు కానీ

  కొత్త సినిమా అనో, కొత్త కథ అనో చెప్పను కానీ ఇందులో ఓ అందమైన ఆత్మ ఉంది. నేను ఆనంద్‌ అనే ఓ వంటవాడిగా కనిపిస్తా. త్రివిక్రమ్‌ అందించిన సలహాలు, సూచనలతో అలవోకగా నటించగలిగా  పరీశీలించి మరీ...

  పరీశీలించి మరీ...

  ‘‘నా నటనని మరో స్టైల్‌లో ఆవిష్కరించే చిత్రం ‘అఆ'. త్రివిక్రమ్‌గారు నన్ను ఎప్పట్నుంచో పరిశీలిస్తున్నారు. సినిమా మొదలయ్యే ముందే నెల రోజులపాటు ఓ వర్క్‌షాప్‌ చేశాం. ఆ సమయంలో ‘ప్రశాంతంగా, కూల్‌గా ఉండు...' అంటూ పాత్రకి తగ్గట్టుగా సెటిల్డ్‌గా నటించేలా ప్రోత్సహించారు త్రివిక్రమ్‌.  డైరక్టర్ మూవీ

  డైరక్టర్ మూవీ

  ఇది వంద శాతం దర్శకుడి సినిమా ఇది. ప్రతి పాత్ర కొత్తగా ఉంటుంది. ఎప్పటికప్పుడు అగ్ర దర్శకులతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. తేజగారు, రాజమౌళిగారి తర్వాత మళ్లీ నా నటనని ప్రభావితం చేసిన దర్శకుడు త్రివిక్రమ్‌గారే''.  త్రివిక్రమ్ అని కథ వినకుండానే

  త్రివిక్రమ్ అని కథ వినకుండానే

  త్రివిక్రమ్ పెద్ద దర్శకుడు అలాంటి వ్యక్తి ఫోన్ చేస్తే చాలా ఎక్సైట్‌మెంట్ వుంటుంది. అందుకే మరో మాట మాట్లాడకుండా ఓకే చెప్పేశాను. కథ కూడా కొత్తగా వుండటంతో సినిమా సెట్స్‌పైకొచ్చింది.  అదే తేడా

  అదే తేడా

  ఇంతకు ముందు నేను చేసిన చిత్రాల్లో ప్రేమకథ మాత్రమే ఉండేది. కానీ ఇందులో ప్రేమకథతో పాటు కుటుంబ భావోద్వేగాలు కూడా వుంటాయి. ఇంత వరకు ఆకతాయి పాత్రల్లో నటించిన నేను ఈ సినిమాలో మాత్రం బాధ్యత గల కొడుకుగా, చెల్లెలిని ప్రేమించే అన్నయ్యగా కొత్తగా కనిపిస్తాను.  నా క్యారక్టరైజేషన్

  నా క్యారక్టరైజేషన్

  తనకు ఒక సమస్య ఉన్నా అది బయటకు కనిపించకుండా నవ్వుతూ..అందరిని నవ్విస్తూ ఉండే పాత్రలో కనిపిస్తాను.ఇప్పటి వరకు నేను నటించిన చిత్రాల్లో నా హృదయానికి దగ్గరైన సినిమా ఇది. చిన్న లైన్ మీద సాగే పాత్రనాది. ఈ పాత్రను పోషించడం చాలా కష్టమనిపించింది. త్రివిక్రమ్‌గారి వల్లే ఈ పాత్ర చేయగలిగాను.  కొట్టుకుంటూనే లవ్

  కొట్టుకుంటూనే లవ్

  అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి. ఇద్దరి మధ్య చిలిపి గొడవలు..గిల్లికజ్జాలు...సున్నితమైన భావోద్వేగాలు వుంటాయి. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం ఉన్నా బయటికి మాత్రం కొట్టుకుంటుంటారు, క్లెమాక్స్‌లో ఎలా తమ ప్రేమను వ్యక్తం చేసుకున్నారు అనేదే ఈ సినిమాలో ఆసక్తికరం.  చెఫ్ ని

  చెఫ్ ని

  ఈ సినిమాలో త్రివిక్రమ్‌గారు నా పాత్రకు కాస్త బరువు, బాధ్యతలు అప్పగించారు. ఇందులో నేనో చెఫ్. సంతోషం, బాధ, రొమాన్స్.. ఇలా అన్ని భావోద్వేగాలు బ్యాలెన్స్ చేసుకుంటూ నన్ను నేను కొత్తగా తీర్చిదిద్దుకుంటూ చేసిన సినిమా. ఇది నా కెరీర్‌కు హార్ట్ లాంటి మూవీ.


  పవన్ రావటం టెన్షన్

  పవన్ రావటం టెన్షన్

  నా ఫేవరేట్ హీరో పవన్‌కల్యాణ్ ఈ సినిమా సెట్స్‌కు రావడం స్వీట్ షాక్. సడన్‌గా ఆయన సెట్‌లో ప్రత్యక్షమయ్యేసరికి టెన్షన్ పడ్డాను. ఆయన ముందు నటించాను కూడా. బాగా చేశాననే అనుకుంటున్నా.  నెక్ట్స్

  నెక్ట్స్

  ‘‘తదుపరి మా సంస్థలోనే ఓ సినిమా చేయబోతున్నా. ‘గుండెజారి గల్లంతయ్యిందే'కి సీక్వెల్‌ సిద్ధమవుతోంది. తొలి సగభాగం స్క్రిప్టు పూర్తయింది. మలి సగభాగం మేం అనుకొన్నట్టుగా వస్తే సినిమాగా మలుస్తాం.


  సమంత లవర్ గురించి

  సమంత లవర్ గురించి

  సమంత ఓ హీరోతో లవ్‌లో ఉన్నారని ప్రచారమవుతోంది కదా... ఆమె మీ ఫ్రెండ్ కాబట్టి.. ఆ హీరో ఎవరో మీకు తెలుసా? అనే ప్రశ్నకు - ''సమంత నాకు ఫ్రెండే. కానీ, తన పర్సనల్ విషయాలు చెప్పుకునేంత కాదు, '' అన్నారు.   పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి

  పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి

  పెళ్లి చేసుకోమని గత రెండేళ్లుగా అడుగుతున్నారు. నేనేమో వచ్చే ఏడాది చేసుకుంటా అని ప్రతి సంవత్సరం వాయిదా వేస్తూ వస్తున్నాను. .  క్లాస్ ప్రేక్షకులకు దగ్గరవుతా

  క్లాస్ ప్రేక్షకులకు దగ్గరవుతా

  త్రివిక్రమ్‌గారి సినిమాలంటే క్లాస్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వుంది. ఈ సినిమాతో ఆ వర్గం ప్రేక్షకులకు చేరువ అవుతానన్న నమ్మకముంది.


  English summary
  Hero Nitin has spoke at length about his next releasing movie "A..Aa" which is hitting cinemas on June 2nd.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more