»   » మానవ మృగాలను దహించే దిశగా నివురు: అల్లం నారాయణ

మానవ మృగాలను దహించే దిశగా నివురు: అల్లం నారాయణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మానవ మృగాలను దహించే దిశగా నివురు సినిమా రావడం, సమాజానికి ఎంతో కొంత మంచి జరుగుతుందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చెర్మన్ అల్లం నారాయణ అన్నారు. సోమాజీగుడా ప్రెస్ క్లబ్‌లో ఇటీవల జరిగిన నివురు సినిమా లోగో, పోస్టర్ ఆవిష్కణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Nivuru film logo launched

ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ - సినిమా అంటే కేవలం అందచందాలే కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. సామాజిక అంశాలను కథావస్తువులుగా ఎన్నుకుని మార్పునకు నాదిం పలకాలని ఆయన సూచించారు.

ఆ తర్వాత పివోడబ్ల్యు సంధ్య మాట్లాడారు. సమాజంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడే మనవ మృగాలకు శిక్షలు పడాల్సిందేనని అన్నారు. ఈ నివురు సినిమా తప్పకుండా విజయం సాధించాలని అన్నారు.

Nivuru film logo launched

ఈ కార్యక్రమంలో చిత్రదర్శకులు రుషీ కృష్ణ, హీరో మహేష్ నీలు, నిర్మాత అభిరామ్, సహ నిర్మాత సోమే,్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేరణ్, నటులు రోషం బాలు, క్రిష్, సంగీత దర్శకుడు ఎంఎల్ రాజు, రచయిత అభి ఉప్పల, సంపత్, మధు, సాగర్, రాజు, శ్రీకాంత్, గిరీ తదితరులు పాల్గొన్నారు.

English summary
Telangana press Akademi chairman Allam Narayan has launched Nivuri film logo and poster recently.
Please Wait while comments are loading...