»   »  చరిత్ర రాయని తిరుగుబాటు కథ "నైజాం సర్కరోడా": రాజమౌళి

చరిత్ర రాయని తిరుగుబాటు కథ "నైజాం సర్కరోడా": రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలంగాణా విమోచన భారత దేశ స్వతంత్ర పోరాటానికి ఏమాత్రం తగ్గని వీర గాథ. హైదరాబాదు 1948 సెప్టెంబర్ 17 వరకు స్వతంత్ర దేశం. బ్రిటీష్ పాలకులు అధికారం అప్పగించిన తర్వాత భారత ప్రభుత్వం దేశంలో ఉన్న సంస్థానాల విలీనానికి ప్రయత్నించింది. అదే ప్రయత్నం లో భాగంగా హైదరాబాద్ సంస్థానమూ భారత ప్రభుత్వం ఆధీనం లోకి వచ్చింది. హైదరాబద్ ని స్వతంత్ర దేశంగా తానే పాలించాలనుకున్న అప్పటి నవాబ్ ఆశలని కుప్పకూల్చిన భారత ఆర్మీ హైదరాబాద్ ని విముక్తం చేసింది... ఇప్పటికి చరిత్రగా చాలామందికి తెలిసిన విషయం ఇంతే... కానీ లోతుగా ఉన్న పోరాటం వేరు, తిరుగు బాటువేరు.. తనని తాను విముక్తం చేసుకునేందుకు ఈ అండర్ నిజాం భూభాగం పడ్డ భాద వేరూ, ఆ పోరాట గాథ వేరు.. అప్పటి పోరాటంలో మరుగున పడ్డ కొన్ని కోణాల్ని కలుపుకుని మరాఠీలో తీసిన 'రజాకార్‌' ఇప్పుడు నైజాం సర్కరోడా అన్న పేరుతో తెలుగులోకి వస్తోంది ...

నైజాం సర్కరోడ

నైజాం సర్కరోడ

సిద్ధార్ధ్‌ జాదవ్‌, జ్యోతీ సుభాష్‌, శరద్‌ బుటాడియా శశాంక్‌ షిండే, జాకీర్‌ హుస్సేన్‌ కీలక పాత్రధారులుగా రూపొందిన మరాఠీ చిత్రం ‘నైజాం సర్కరోడ' టైటిల్‌తో తెలుగులోకి అనువాదమవుతోంది. నైజాం, తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి రాజ్‌ దుర్గే దర్శకుడు. రత్నం దవేజి సమర్పణలో మౌళి ఫిల్మ్స్‌ పతాకంపై రాజమౌళి నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు.

మరాఠీలో ‘రజాకార్‌'

మరాఠీలో ‘రజాకార్‌'

‘రజాకార్‌' పేరుతో రెండేళ్ళ కిందటే మరాఠీలో విడుదలైనా తెలుగులోకి రావటానికి మాత్రం చాలా సమయమే పట్టింది. అయితే మహారాష్ట్రలో ఈ సినిమా పెద్ద సంచలనమే సృష్టించింది. "హైదరాబాద్‌ విముక్తి పోరాటంలో పాల్గొని మహరాష్ట్రలో స్థిరపడ్డ ఒక యోధుడి తనయుడు రాజ్‌ దుర్గే తెరకెక్కించిన చిత్రమిది.

రజాకార్ల రాక్షస రాజ్యంలో

రజాకార్ల రాక్షస రాజ్యంలో

17 సెప్టెంబర్‌ 1948 కన్నా ముందు రజాకార్ల రాక్షస రాజ్యంలో జరిగిన అకృత్యాలు, దురాగతాలకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈ సినిమా. పూట గడవడం కోసం పోరాడే ఓ సామాన్య మనిషి చారిత్రాత్మక విముక్తి పోరాటంలో ఏవిధంగా భాగస్వామి కాగలిగాడనేది ఆసక్తికరం. అప్పటి స్థితిగతులు, సంస్కృతి, భాష, పోరాటాల తీరు దర్శకుడు రాజ్‌ దుర్గే చక్కగా తెరకెక్కించారు తెలుగు వాళ్లు తీయాల్సిన చిత్రమిది.

ఆనందంగా ఉంది

ఆనందంగా ఉంది

మరాఠీలో రూపొందిన ఈ చిత్రం అనువాద హక్కులు నాకు దక్కినందుకు ఆనందంగా ఉంది. తెలుగు వర్షన్‌కి ‘నైజాం సర్కరోడ' టైటిల్‌ కరెక్ట్‌గా యాప్ట్‌ అవుతుంది. చక్కని వినోదం పంచే సినిమా ఇది. ఆర్టిస్ట్‌ షఫీ ఈ సినిమాకు డబ్బింగ్‌ చెప్పడం గొప్ప విషయం. అనువాద కార్యక్రమాలు పూర్తికావొచ్చాయి.

తెలంగాణ విమోచన దినంకు ముందు ఒక వారం రోజుల వ్యవధిలో జరిగిన కథ

తెలంగాణ విమోచన దినంకు ముందు ఒక వారం రోజుల వ్యవధిలో జరిగిన కథ

త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అంటూ కొన్ని నెలలకిందటే చెప్పిన నిర్మాత రాజమౌళి ఇప్పటికే సినిమాను రెండు సార్లు తెలుగులో విడుదల చేయాలని ప్రయత్నించినా కొన్ని కారణాలవల్ల సాధ్యం కాలేదు. హైదరాబాద్‌ సంస్థానంలో, నైజాం పరిపాలనలో 1948 సెప్టెంబర్‌ 17 (తెలంగాణ విమోచన దినం)కు ముందు ఒక వారం రోజుల వ్యవధిలో జరిగిన కథతో ఈ చిత్రాన్ని రాజ్‌ దుర్గే గొప్పగా రూపొందించారు.

రెండు రకాల పోరాటాలు

రెండు రకాల పోరాటాలు

అప్పట్లో రజాకార్ల దురాగతాలపై రెండు రకాల పోరాటాలు జరిగాయి. ఒక పోరాటాన్ని మరాఠీవాళ్లు, ఆర్యసమాజ్‌ వాళ్లు కలిసి నిర్వహిస్తే, మరో పోరాటాన్ని సామాన్య ప్రజానీకం, కమ్యూనిస్టులు కలిసి జరిపారు. ఈ సినిమాలో ఆ పోరాటాలు కనిపిస్తాయి. నిజామాబాద్‌ జిల్లాలోని ఖాండ్‌గామ్‌ గ్రామంలో నివసించే హరి అనే పేద అమాయక యువకుడు.. తన తల్లిని రాజాకార్లు కిరాతకంగా హత్యచేస్తే, వారిపై అతను ఎలా పోరాడాడనేది ఈ చిత్రంలోని ప్రధానాంశం.

ఈ నెల 8 న ప్రేక్షకుల ముందుకు

ఈ నెల 8 న ప్రేక్షకుల ముందుకు

ఆ తల్లీ కొడుకుల అనుబంధాన్ని దర్శకుడు మనసుల్ని హత్తుకొనేలా ఎంత బాగా చిత్రీకరించారో, సామాన్యులపై రజాకార్ల దురాగతాల్ని అంతగా ఒళ్లు గగుర్పాటు కలిగేలా కళ్లకు కట్టినట్లు చూపించారు. అంటూ టీం చెబుతున్నా. చరిత్రలో లేని అంశాలను కూడా కలిపారన్న విమర్శకూడా ఉంది. అయితే ఏది నిజం అన్నది సినిమా వస్తే తప్ప చెప్పలేం. మొత్తానికి అన్ని అడ్డంకులనూ అధిగమించి ఈ నెల 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది .

English summary
Naizam Sarkaroda the Movie wich is Dubbed from Marathi "rajakar" will hit the screans on 8th of this month
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu