»   » పాపం ఒక్కరు కూడా పట్టించుకోలేదు: సునీల్ పరిస్థితి ఇలా అయ్యింది

పాపం ఒక్కరు కూడా పట్టించుకోలేదు: సునీల్ పరిస్థితి ఇలా అయ్యింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాప్‌ కమెడియన్‌గా తెలుగు సినిమా పరిశ్రమలో చెలమణి అవుతున్న రోజుల్లో హీరోగా అవతారం మార్చుకున్నాడు. ఆ కొత్త అవతారం లో మొదట్లో కొన్ని విజయాలు వరించినా, ఇప్పుడు వరుసగా పరాజయాలే పలుకరిస్తున్నాయి. కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి అందాల రాముడు, మర్యాద రామన్న ఇలా వరుస హిట్స్ తో దూసుకు వెళ్లాడు. తర్వాత మనోడికి గడ్డు పరిస్థితులు ఏదురయ్యాయి. తీసిన ప్రతి సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో హీరోగా సునీల్ కెరీర్ ప్రశ్నార్థకం అయ్యింది. ఇటీవల వచ్చిన 'జక్కన్న' కొద్దిగా ఫర్వాలేదనిపించినా.. తర్వాత వచ్చిన 'వీడు గోల్డ్‌ ఎహే' దారుణ పరాజయం చవిచూసింది.

హీరోలు తక్కువయ్యారని కాదు

హీరోలు తక్కువయ్యారని కాదు

గతం లో కమేడియన్ నుంచి హీరోలు గా వచ్చినా తర్వాత మళ్ళీ తమ ట్రాక్ లోనే కెరీర్ కొన సాగిన వాళ్ళు చాలామందే ఉన్నారు. నిజానికి మొదట్లో కూడా కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి అంటే కాస్త వెరైటీ కనిపించి మాత్రమే అంతే గానీ ఇప్పటికిప్పుడు టాలీవుడ్ లో హీరోలు తక్కువయ్యారని కాదు.


బ్రహ్మానందం, అలి

బ్రహ్మానందం, అలి

ఈ లిస్ట్ లో వచ్చిన బ్రహ్మానందం, అలి కూడా హీరోలు గా చేసినా తమ ట్రాక్ దాటి పోవాలనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే కమేడియన్ అనే ఇమేజ్ లో ఉన్నారు. దాన్ని దాటి ఏం చేసినా అది ఏదో కాస్త చేంజ్ గా ఉంటుందని చేయాలి తప్ప కంప్లీట్ గా మారటం కుదరదు.


దారుణం గా దెబ్బతిన్నాడు

దారుణం గా దెబ్బతిన్నాడు

ఈ విషయం లోనే దారుణం గా దెబ్బతిన్నాడు సునీల్. కాలం కాని కాలం లో హీరో అయిపోదామని 6 ప్యాక్ కూడా చేసేసి రంగం లోకి దిగాడు గానీ దాన్ని కంటిన్యూ చేయలేక పోయాడు, డాన్సులూ, ఫైట్లూ, ఎంత చేసినా ప్రేక్షకుల దృష్టిలో సునీల్ ఇప్పటికీ కమేడియనే.


కామెడీ అనే అనుకుంటున్నారు

కామెడీ అనే అనుకుంటున్నారు

సునీల్ సినిమా అంటే కామెడీ అనే అనుకుంటున్నారు జనాలు ఆ ఉద్దేశ్యం తోనే థియేటర్లకు వెళ్ళి ఫక్తు మాస్ హీరో వేశంలో ఉన్న సునీల్ ని చూడలేక పోతున్నారు. అందు వల్లే మొదటి ఒకటీ రెండూ తప్ప మిగతా వాటిలో కనీసం హిట్ అనిపించుకున్న సినిమా ఒక్కటి కూడా లేదు.


ఉంగరాల రాంబాబు

ఉంగరాల రాంబాబు

ప్రస్తుతం సునీల్ హీరోగా నటించిన "ఉంగరాల రాంబాబు " సినిమా రిలీజ్ కి సిద్ధమైంది . పరుచూరి శివరామ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి చక్కటి చిత్రాలు దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ సినిమాపై సునీల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.


బయ్యర్స్ వస్తేనే సినిమా రిలీజ్

బయ్యర్స్ వస్తేనే సినిమా రిలీజ్

అయితే సినిమా షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ చేసుకుంది కానీ సునీల్ కు హిట్ లేకపోవడంతో ఒక్క బయ్యర్ కూడా సినిమాని కొనడానికి ముందుకు రావడం లేదు . దాంతో బయ్యర్స్ వస్తేనే సినిమా రిలీజ్ చేయగలనని లేదంటే నష్టపోవడం ఖాయమని , అంతటి రిస్క్ తీసుకోలేనని బయ్యర్ల కోసమే ఎదురు చూస్తున్నాడు నిర్మాత . మరి బయ్యర్లు వచ్చేదెపుడో ఈ సినిమాకు మోక్షం ఎపుడో వేచి చూడాల్సిందే.English summary
For latest information buyers are not at all interested to buy the movie Sunil's Ungarala Rambabu. Having found no buyers, the movie makers had postponed the movie release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu